ట్రాఫిక్ జామ్‌లో అమితాబ్.. బిగ్‌బీకి గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్.. ట్రోల్ చేసిన నెటిజన్లు
ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ల వయసులో కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్‌తో గణపతి, ఆ తర్వాత ఘూమెర్, ఉమేష్ క్రానికల్స్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి సోషల్ మీడియాలో పంచుకొంటూ..
టూ వీలర్‌పై అమితాబ్ బచ్చన్: ముంబైలో షూటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. దాంతో సకాలంలో చేరేందుకు తనకు తెలియని వ్యక్తిని టూ వీలర్‌పై లిఫ్ట్ అడగడం, ఆ వ్యక్తి వెంటనే ఒకే అనడంతో సూపర్ స్టార్ అమితాబ్ ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం గురించి బిగ్ బీ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్వయంగా తెలియజేశారు.

థ్యాంక్యూ టోపీవాలా అంటూ: నన్ను సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేర్చిన ద్విచక్ర వాహనదారుడికి థ్యాంక్స్. నీవు ఎవరో తెలియదు కానీ.. నేను లిఫ్ట్ అడగ్గానే.. వెంటనే అంగీకరించి నన్ను నీ వాహనంపై తీసుకెళ్లావు. సకాలంలో లొకేషన్‌కు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొన్న నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లావు. క్యాప్, పసుపు పచ్చని టీషర్ట్ ధరించిన వ్యక్తికి థ్యాంక్స్ అని అమితాబ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

దటీజ్ అమితాబ్ బచ్చన్ అంటూ: అమితాబ్ బచ్చన్ దాదాపు 60 దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికీ సూపర్ స్టార్‌గా అభిమానులు, ప్రేక్షకులచే ప్రశంసలు అందుకొంటున్నారు. ఇంతంటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా నటనపట్ల అంకిత భావం చూపతున్న అమితాబ్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ తరం సినీ తారలు అమితాబ్‌ను నేర్చుకోవాల్సిందే అంటూ సలహా ఇస్తున్నారు.

హెల్మెట్ పెట్టుకోలేదంటూ..:
అయితే ది చక్రవాహనంపై ప్రయాణించిన మీ ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవడం మరిచారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం సరికాదు. తొందరలో ఏదో తప్పు జరిగి ఉంటుంది. కానీ ఇక ముందు టూ వీలర్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ వాడటం తప్పనిసరిగా పాటించండి అంటూ అమితాబ్‌కు నెటిజన్లు సలహా ఇచ్చారు.
ప్రాజెక్ట్ Kలో గాయపడి..: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. పక్కటెముకలకు భారీ గాయం కావడంతో కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకొంటూ చికిత్స పొందారు. తాజాగా గాయం నుంచి తేరుకోవడంతో ఆయన మళ్లీ షూటింగులతో బీజీగా మారారు. 80 వయసులో కూడా టైమ్స్ సెన్స్‌ను పాటించడం వల్లే ఆయన సూపర్ స్టార్ అయ్యారనేది మరోసారి రుజువైంది.


Click it and Unblock the Notifications











