ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అమితాబ్ మనవరాలు.. ప్రముఖ నటుడి కుమారుడితో డేటింగ్!
ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు నవ్య నవేలి అఫైర్లు, డేటింగ్‌కు సంబంధించిన వార్తలు ఇటీవల కాలంలో బాలీవుడ్ మీడియాలో తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇంతకు అమితాబ్ మనవరాలి ప్రియుడు ఎవరంటే...

బిగ్‌బీ మనవరాలిగా సెలబ్రిటీ స్టేటస్
అమితాబ్, జయబచ్చన్ మనవరాలిగా సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకొన్న నవ్య నవేలి... ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులతో నిత్యం బిజిగా ఉంటారు. తన రోజువారీ దినచర్యలను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయగా వైరల్ అయింది.

ప్రముఖ నటుడి కుమారుడితో
కొద్దికాలంగా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ జావెద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీతో డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో నానుతున్నది. మీజాన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నీ ముఖం చూపించవా అంటూ చిలిపిగా తన ప్రియుడి కళ్లలోకి చూస్తూ కామెంట్ పెట్టింది.

మా మధ్య అలాంటి బంధమే
అయితే నవ్య నవేలితో రిలేషన్‌షిప్ గురించి మీజాన్‌ను మీడియా ప్రశ్నించగా.. తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పడానికి నిరాకరించారు. అదే ప్రశ్నను పదే పదే అడిగితే.. మా మధ్య ఎలాంటి బంధం లేనప్పుడు ఏదో ఉన్నదని మీకు చెప్పడం సరికాదు అని మీజాన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

నో డేటింగ్.. ఓన్లీ ఫ్రెండ్‌షిప్
అయితే డేటింగ్, అఫైర్లను ప్రస్తావించగా.. నవ్యతో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. మేమిద్దరం స్నేహితులం మాత్రమే. ఫ్రెండ్ అనేది ఓ రిలేషన్‌షిప్ మాత్రమే. అది బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ డేటింగ్ లాంటి రిలేషన్‌షిప్ కాదు. ఏదో మేమిద్దరం కలిసి తిరిగితే అది డేటింగ్ అనుకొంటే తప్పు అని మీజాన్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











