200 దేశాల్లో 15 భాషల్లోకి గులాబో సితాబో.. అమితాబ్ మూవీ సంచలనం

ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యువ హీరో ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన గులాబో సితాబో చిత్రం మరో రికార్డును సొంతం చేసుకోబోతున్నది. షూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా జూన్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. వాస్తవానికి థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ.. కరోనా పరిస్థితులు కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాను దాదాపు 15 భాషల్లో సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Amitabh Bachchans Gulabo Sitabo into 15 languages to cover 200 countries

గులాబో సితాబో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లోని ప్రేక్షకులకు అందించే క్రమంలో అరబిక్, రష్యా, పోలీష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, ఇండోనేషియన్, మలయ్, కొరియన్, గ్రీక్, హెబ్రూ, టర్కిష్‌తోపాటు ఇంగ్లీష్ భాషలకు సంబంధించిన సబ్‌టైటిల్స్‌తో రిలీజ్ చేస్తుండటం విశేషంగా మారింది.

లక్నో నేపథ్యంగా సాగే కథలో పాతతరం భూస్వామి మీర్జా పాత్రలో అమితాబ్ బచ్చన్, ఆయన ఇంటిలో కిరాయిదారుడైన బ్యాంకీ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నారు. ఉత్తర, ధక్షిణ ధృవాల మాదిరిగా ఉండే వీరు తీరు ఉండటం వల్ల జరిగే చిలిపి ఘర్షణలను ఆసక్తిగా తెరకెక్కించినట్టు సమాచారం. అయితే ఈ బలమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.

రైజింగ్ సన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన గులాబో సితాబో చిత్రానికి జుహి చతుర్వేది కథను అందించగా, నోని లహిరి, షీల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X