అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీపై కేసు.. అసలేం జరిగిందంటే..
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ 12)పై కేసు నమోదైంది. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ఎపిసోడ్‌లో అడిగిన ఓ వివాదాస్పద ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్నోలో కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, అంతేకాకుండా కుల వివక్ష, అస్పృశ్యత అంశాల విషయంలో మనుసృతిని గురించి బీఆర్ అంబేద్కర్ ఖండించారు అని అమితాబ్ చెప్పడం వివాదంగా మారింది
కేబీసీ 12 ఎపిసోడ్‌లో రూ.640,000 ప్రశ్నగా.. 1927 డిసెంబర్ 25 తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అతని అనుచరులు ఏ పుస్తకాన్ని దహనం చేశారు అని అడిగారు. ఆ ప్రశ్నకు a) విష్ణు పురాణం b) భగవద్గీత, c) రుగ్వేదం, d) మనుస్మృతి సమాధానాలు ఇచ్చారు.

ఈ ప్రశ్న హిందువులు మనోభావాలను కించపరిచే విధంగా ఉంది. వామపక్షాల ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. కమ్యునిస్టులు తమ ప్రణాళిక ప్రకాశం చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.


Click it and Unblock the Notifications











