ఈయన ఎవరో గుర్తు పట్టడం కష్టమే... ఎవరూ ఊహించ లేదు, ఫ్యాన్స్ ఆశ్చర్యం!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో 'గులాబో సితాబో' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అమితాబ్ లుక్ విడుదలైంది.
తొలుత ఈ లుక్ చూసిన అభిమానులు ఈయన తాము ఎంతగానో అభిమానించే 'బిగ్ బి' అనే విషయం గుర్తు పట్టలేక పోయారు. ఆయన మేకోవర్ ఆ రేంజిలో ఉంది మరి! అసలు ఏ కోణంలో చూసినా ఆయన అమితాబ్ జీ అనే చిన్న క్లూ కూడా కనిపించడం లేదని అంటున్నారు.
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా ఈ లుక్ విడుదల చేశారు. లుక్ చూసిన తాము అస్సలు పోల్చుకోలేదని, గతంలో అమితాబ్ జీ ఎన్ని రకాల పాత్రలు వేసినా, మారు వేషాలు వేసినా తాము గుర్తు పట్టామని, అయితే ఇందులో అలాంటి అవకాశమే లేదు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా ప్రోస్తెటిక్ మేకప్ మేకప్ ఎఫెక్టే
ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్ మేకప్ వేశారు. ఇందులో ఆయన అమ్రిష్ మల్హోత్రా అనే లఖ్‌నవూకు చెందిన ఓ కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో నటిస్తున్నారు. పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.

‘గులాబో సితాబో'
‘గులాబో సితాబో' చిత్రానికి జుహి చతుర్వేది కథ అందించారు. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తుండగా... రోనీ లహరి, శీల్ కుమార్ నిర్మాతలు. 24 ఏప్రిల్, 2020లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పాపులర్ అయిన గులాబో, సితాబో అనే పాత్రల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కుతోంది.

అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన అలుపెరుగకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఝండ్, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ మే హూ, బ్రహ్మాస్త్ర, చెహ్రే, గులాబో సితాబో అనే చిత్రాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











