అమితాబ్ నోట పుష్ప రాజ్ డైలాగ్.. మామూలు వాడకం కాదుగా.. సోషల్ మీడియాలో వైరల్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమా దక్షిణాది బాషలలోనే కాక హిందీలో కూడా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా డైలాగ్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఈ డైలాగులను బాగా ఫేమస్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా డైలాగ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నోటి వెంట వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

చివరి ప్రశ్న
కౌన్ బనేగా కరోడ్‌పతి-14 సీజన్-14 త్వరలో ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా, దీని రిజిస్ట్రేషన్ కోసం ప్రశ్నలు అడుగుతున్నారు. కేబీసీలో అమితాబ్ బచ్చన్ ముందు హాట్ సీట్‌లో కూర్చోవాలనుకునే వారు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపితే చాలు. ఇక ఏప్రిల్ 23న అమితాబ్ బచ్చన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన చివరి ప్రశ్నను అడిగారు.

పుష్ప కొండలు
KBC రిజిస్ట్రేషన్ యొక్క 15వ మరియు చివరి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే 'పుష్ప ది రైజ్' చిత్రంలో చూపించిన ఎర్రచందనం చెట్లు అసలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయని అడిగారు. ఆ అషన్స్ - A. పశ్చిమ కనుమలు B. సుందర్‌బన్స్ C. తూర్పు కనుమలు D. దోబా అయితే సరైన సమాధానం- తూర్పు కనుమలు అంటే సి.

ట్రెండ్ చేస్తు
అలా ఆ ప్రశ్న అడగడానికి ముందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఫైర్ అంటూ డైలాగ్ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఈ వీడియో అలా బయటకు వచ్చిందో లేదో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 'ఇక పుష్ప' సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా సదరు వీడియోను లైక్ చేశారు. అమితాబ్ నోటితో బన్నీ డైలాగ్ వినేసరికి అల్లు ఫాన్స్ సంతోషానికి అవధుల్లేవు. అయితే, 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లోని ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు.

జాగ్రత్త పడ్డారని
ప్రస్తుతం రెండో భాగం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్న సుకుమార్ అది పూర్తయ్యాక 'పుష్ప ది రూల్' పేరుతో ఈ చిత్రాన్ని అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. మరోవైపు అన్ని బాషల ప్రేక్షకుల్లో ఈ సెకండ్ పార్ట్‌పై ఓ రేంజ్ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను మించేలా పుష్ప పార్ట్-2 ఉండాలని ప్లాన్ చేస్తున్న సుకుమార్ కేజీఎఫ్ 2 సక్సెస్ తో మరింత జాగ్రత్త పడ్డారని అంటున్నారు.

పుష్ప రెండో భాగం
మే చివరి వారంలో లేదా జూన్ తొలివారంలో 'పుష్ప ది రూల్' చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి చక చకా ఫినిష్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. పుష్ప పార్ట్- 1 డిసెంబర్ 17న విడుదలై భారీ సక్సెస్ అయిన కారణంగా పుష్ప పార్ట్- 2 విషయంలోనూ అదే సెంటిమెంట్ ఫాలో కాబోతున్నారని, ఈ మేరకు పుష్ప రెండో భాగం రిలీజ్ కోసం డిసెంబర్ 17 నే ముహూర్తంగా ఎంచుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











