KBC 13: కాలి బొటనవేలు విరిగిన తగ్గని అమితాబ్ బచ్చన్.. నొప్పిగా ఉందని షోలోనే..

బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం KBC 13వ సీజన్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ మెగా స్టార్ గా అమితాబ్ బచ్చన్ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీ లో ఎన్నో రికార్డులు నెలకొల్పి సినిమా చరిత్రలో తనకంటూ ఆమె అధ్యాయాన్ని లిఖించారు. ఇక బచ్చన్ ప్రస్తుతం ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ మంచి కంటెంట్ ఉన్న మంచి సినిమాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా రియాలిటీ షోలతో కూడా ఆయన అప్పుడప్పుడు బిజీగా మారుతున్నారు. అయితే ఇటీవల ఆయన కాలికి గాయం అయినప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే షోలో పాల్గొనాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

అభిమానులంటే అంత ఇష్టం..

అభిమానులంటే అంత ఇష్టం..

అమితాబచ్చన్ స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన తన కుటుంబాన్ని ఎంత గా ప్రేమిస్తారో అలాగే ఎదురు పడే ప్రతి వ్యక్తిని కూడా అంతే గౌరవిస్తారు. అలాగే ప్రతి సారి అభిమానులను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తారు. తన స్టార్ హోదా పెరగడానికి ముఖ్యమైన అభిమానులను కలుసుకోవడానికి తనకు ఏమాత్రం ఇబ్బంది లేదని తన జీవితకాలం పాటు వీలైనంత ఎక్కువ మందిని కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తానని కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా

ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా

ఇక అమితాబ్ బచ్చన్ ఒక పని పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు అంటే వీలైనంతవరకు ఎంతో క్రమశిక్షణతో ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా పనిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతారు.. కొన్ని సార్లు ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా పనులు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. ఇక ఎన్నో సార్లు హాస్పిటల్ నుంచి షూటింగ్ కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

KBC షోలో నొప్పితోనే

KBC షోలో నొప్పితోనే

అయితే ఇటీవల అమితాబచ్చన్ తన కాళ్లకు గాయమవడంతో ఇబ్బంది పడుతూనే కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో పాల్గొన్నారు. అది ఎంతో నొప్పిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పటిలానే రియాల్టీ షో కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కొనసాగించడం విశేషం. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేశారు. కాలి బొటనవేలు పెరిగినప్పటికీ దానికి చిన్న పట్టి కట్టుకునే కనిపించారు. కొన్ని సందర్భాల్లో అది చాలా నొప్పిని కలిగిస్తుంది అని కూడా ఆయన పేర్కొన్నారు.

విజయవంతంగా..

విజయవంతంగా..

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అమితాబచ్చన్ వీలైనంత త్వరగా బయటపడాలని కూడా వారి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. KBC 13 సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల మొదలైన ఈ రియాలిటీ గేమ్ షో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్

అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్

ఇదిలా ఉండగా, ఈ శుక్రవారం జరిగే 'కెబిసి 13' ప్రత్యేక ఎపిసోడ్‌లో నటులు ప్రతీక్ గాంధీ మరియు పంకజ్ త్రిపాఠి పాల్గొంటారు. షో కోసం అంతా బచ్చన్ ఒక ఎపిసోడ్ కు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు అయితే వస్తుంది గతంలో రెండు కోట్ల వరకు అమితాబచ్చన్ ఈసారి అంతకుమించి చాట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X