twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేర్ పిక్ షేర్ చేసిన అమితాబ్.. అచ్చం సోనూలా ఉన్నారే?

    |

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చిత్రాలను, వీడియోలను సోషల్ హ్యాండిల్స్‌లో షేర్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అలా ఆయన ఎక్కువగా తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజు ఆయన తన సినీ జీవితంలో నుంచి ఒక త్రోబ్యాక్ చిత్రాన్ని పంచుకున్నారు. ఈ దెబ్బతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఈ ఫోటో అమితాబ్ అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ఎందుకంటే అభిమానులు అందరూ ఆయనని నటుడు సోను సూద్ తో పోలుస్తున్నారు. అవును, మీరు సరిగ్గా చదువుతున్నారు. అమితాబ్ పాట ఫోటో సోనూను గుర్తు చేస్తుంది.

    ఈ ఫోటో 1971లో వచ్చిన తన చిత్రం రేష్మా ఔర్ షెరా కోసం లుక్ టెస్ట్ కోసం ఇచ్చిన ఫోటో అని పేర్కొన్నారు. తన అధికారిక ఇన్‌ స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో "రేష్మా ఔర్ షెరా" చిత్రం కోసం నా లుక్ టెస్ట్ .. 1969లో .. నేను నిజంగా ఎంపికయ్యాను "అని పేర్కొన్నారు. ఈ ఫోటోలో అమితాబ్ రాజస్థానీ వ్యక్తి దుస్తులు ధరించి కనిపిస్తాడు. అమితాబ్ తన తలపై పెద్ద తలపాగా, రెండు హారాలు మరియు చెవిపోగులు కూడా ధరించాడు. మరియు అమితాబ్ తన దృష్టిని పైన కేంద్రీకరిస్తూ ఉన్నట్టు కనిపించారు.

     Amitabh Bachchan shares rare PIC Fans says looking like Sonu Sood

    సునీల్ దత్, వహీదా రెహమాన్ నటించిన ఈ సినిమాలో వినోద్ ఖన్నా, రాఖీ, రంజిత్, కె ఎన్ సింగ్, జయంత్, అమ్రీష్ పూరి సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ ఫోటో గురించి అభిమానులు రకరకాల కామెంట్లు చేశారు. "నేను అమితాబ్ సార్‌ను అగౌరవపరచడం ఇష్టం లేదు, కానీ నేను సోను సూద్ సార్‌ను ఒక్క క్షణం చూశాను?" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక అభిమాని ఈ ఫోటోలో ఉన్నది "సోను సూద్" అని రాశాడు. ఇక వర్క్ ఫ్రంట్‌లో, ఆయన తదుపరి బ్రహ్మాస్త్ర, గుడ్ బైలో కనిపిస్తాడని అన్నారు.

    English summary
    Amitabh Bachchan shared a throwback picture on his Instagram handle. fans confused and they compared him with another actor Sonu Sood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X