తెలియకపోతే అది మూస్కోని కూర్చో.. ప్రమోషన్స్ అనగానే భగ్గుమన్న బిగ్ బి!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గత నెల కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. దాడపు మూడు వారాల పాటు ఆయన కరోనాతో పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించారు. అయితే అయన హాస్పిటల్ లో ఉన్నపుడే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు చచ్చిపోవాలని కూడా కోరుకున్నారని అమితాబ్ కామెంట్ చేశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన మరిన్ని నెగిటివ్ కామెంట్స్ పై అమితాబ్ మరింత సీరియస్ అయ్యారు.

పూర్తిగా కోలుకున్న తరువాతే

పూర్తిగా కోలుకున్న తరువాతే

గత వారం అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని నానావతి హాస్పిటల్ లో అమితాబ్ దాదాపు మూడు వారాలు ఉండవలసి వచ్చింది. పూర్తిగా కోలుకున్న తరువాతే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఎప్పటిలానే ఆయన సోషల్ మీడియాలో మళ్ళీ చురుగ్గా కనిపిస్తున్నారు.

 ఎంతో జాగ్రత్తగా చుసుకున్నారు..

ఎంతో జాగ్రత్తగా చుసుకున్నారు..

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తనకు వైద్యం అందించిన నానావతి హాస్పిటల్ పై అనేక రకాల ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడి వైద్యులు, నర్సులు ఎంతగానో కష్టపడుతున్నారు అంటూ తనను ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా చుసుకున్నారని అన్నారు. అయితే ఇది కూడా ఒక ప్రమోషన్ లో భాగమేనా అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా బిగ్ బి తన బ్లాగ్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు.

 అబద్ధపు రిపోర్ట్స్ ఇచ్చారు..

అబద్ధపు రిపోర్ట్స్ ఇచ్చారు..

సదరు మహిళా నెటిజన్ ముందుగా ఏమన్నాడనంటే.. తన తండ్రిని నానావతి హాస్పిటల్ లో చేర్పించగా కరోనా ఉందని అబద్ధపు రిపోర్ట్స్ ఇచ్చారని మరొక హాస్పిటల్ లో పరీక్షలు చేయించగా పూర్తిగా నెగిటివ్ అని వచ్చినట్లు తెలిపింది. ఇక అలాంటి హాస్పిటల్ కి బిగ్ బి ప్రమోషన్స్ చేయడం చూస్తుంటే తనకు ఆయనపై ఉన్న గౌరవం ఊయిందని అన్నారు.

పబ్లిసిటీ కోసం కాదు..

పబ్లిసిటీ కోసం కాదు..

బ్లాగ్ ద్వారా ఆ కామెంట్స్ పై స్పందించిన అమితాబ్.. కరోనాతో పోరాడుతున్న సమయంలో వారు నన్ను సంరక్షించారు. మెరుగైన చికిత్స అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఆస్పత్రి కోసం పబ్లిసిటీ చేయడం లేదు. మీరు నాపై గౌరవం కోల్పోయినా కూడా నేను వైద్యులను నిత్యం గౌరవిస్తూనే ఉంటాను అని అమితాబ్ తెలియజేశారు.

Recommended Video

Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ
తెలియకపోతే మూసుకొ..

తెలియకపోతే మూసుకొ..

అనంతరం మరొక నెటీజన్ అమితాబ్ బచ్చన్ ఆముల్ డూడుల్ పై కూడా నెగిటివ్ కామెంట్ చేయగా అమితాబ్ సీరియస్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ ఆ డూడుల్ ని పోస్ట్ చేస్తూ 'ఏబీ బిట్స్ సి' అని రాసుకొచ్చారు. అంటే అమితాబ్ కరోనాను జయించారని అర్థం. అయితే ఇది కూడా ఒక ప్రమోషన్ స్టంట్ అంటూ నెటిజన్ కామెంట్ చేయగా 'విషయం తెలియకపోతే నోరు మూసుకొని ఉండు' అని అమితాబ్ సీరియస్ గా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X