ముసలోడా, ఐశ్వర్యరాయ్ ఎక్కడ? నెటిజన్లకు బిగ్‌బీ దిమ్మతిరిగే జవాబు

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టులతో అభిమానులను అలరిస్తుంటారు. అయితే అడపాదడపా నెటిజన్ల ఆకతాయి పనులకు బిగ్‌బీ గురవుతుంటారు. తాజాగా బిగ్‌బీని కొందరు ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన గట్టిగా బుద్ది చెప్పారు. తనదైన శైలిలో జవాబిచ్చే సరికి నెటిజన్లు నోర్మూసుకొన్నారు.

ఉత్తరాది ప్రజలకు ఇష్టమైన బైసాకీ పండుగ గురించి వెల్లడిస్తూ అమితాబ్ తన ఇన్స్‌టాలో తన సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను పోస్టు చేశారు. ప్రజలంతా పండుగను ఇంటి వద్దనే ఉండి భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి కష్టకాలంలో ఈశ్వరుడి దీవెనలు అందరికీ ఉంటాయి అని చెప్పారు.

Amitabh Bachchan stiff answer to Buddhe trolls on Instagram

ఇలా తన పోస్టుకు ఓ నెటిజన్ తిక్కతిక్కగా స్పందిస్తూ.. ఐశ్వర్యరాయ్ ఎక్కడుంది.. ఓ ముసలోడా అంటూ ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందకుండా మాటలతో తగిన రీతిలో బిగ్‌బీ బుద్ది చెప్పారు. అమె ఎక్కడ ఉన్నారో తెలుసా? బాప్ రే బాప్ మీరు చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే ఇలాంటి చవకబారు కామెంట్లకు దూరంగా ఉండాలని అమితాబ్‌కు అభిమానులు సలహా ఇచ్చారు. ఇలాంటి ట్రోల్స్‌కు సమాధానం ఇవ్వకూడదని సూచించారు.

ఇక అమితాబ్ విషయానికి వస్తే.. సుజిత్ సర్కార్ సినిమా గులాబో సితాబో చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X