ప్రియుడితో రెచ్చిపోతున్న హీరో కూతురు... ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లేనా?

Recommended Video

Bollywood Young Hero & Heroine In A Serious Affair || Filmibeat Telugu

బాలీవుడ్ యంగ్ యాక్టర్స్ సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో తన తండ్రి, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఓ టాక్ షోలో పాల్గొన్న సందర్భంలో కూడా సారా మాట్లాడుతూ... తనకు కార్తీక్ ఆర్యన్ మీద క్రష్ ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న సినిమాలో ఎంపికయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటం, చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండటంతో వీరి మధ్య సీరియస్ రిలేషన్ మొదలైందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. తన లవ్ విషయంలో సారాకు ఇంట్లో వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందట.

అమృత సింగ్ ఓకే చెప్పిందా?

అమృత సింగ్ ఓకే చెప్పిందా?

సారా, కార్తీక్ ఆర్యన్ విషయం ఇంట్లో ముందే తెలుసుని, సారా తల్లి అమృత సింగ్‌కు కార్తీక్ అంటే చాలా ఇష్టమని, అతడినే సారా తన బాయ్ ఫ్రెండుగా ఎంచుకోవడంతో ఆవిడ హ్యాపీగా ఉందని, హద్దులో ఉంటూ ప్రేమించుకోండి అంటూ వీరి ప్రేమకు అప్రూవల్ ఇచ్చిందని టాక్.

కార్తీక్ పేరెంట్స్ ఓకేనా?

కార్తీక్ పేరెంట్స్ ఓకేనా?

సారా అలీ ఖాన్ కుటుంబ నేపథ్యం, లైఫ్‌స్టైల్‌తో పోలిస్తే... కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ పూర్తిగా విభిన్నమైంది. అయితే వారి మనసును గెలుచుకోవడంలో సారా సక్సెస్ అయిందట. అందుకే ఇద్దరూ చాలా ఓపెన్‌గా... ఎలాంటి దాపరికాలు లేకుండా తమ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారని టాక్.

పెళ్లి చేసుకుంటారా?

పెళ్లి చేసుకుంటారా?

ప్రేమ అనే అంశం తర్వాత ఎవరి జీవితంలో అయినా ప్రస్తావనకు వచ్చే పెళ్లి అంశమే. సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకుంటారా? అంటే..... వారికి ఇంకా పెళ్లి వయసు రాలేదు, చాలా చిన్న పిల్లలు, ప్రస్తుతం వారు సంతోషంగా ఉన్నారు, వారిని అలా ఎంజాయ్ చేయనివ్వండి, ఎవరి జీవితంలో ఏది ఎప్పుడు జరుగాలో అప్పుడు జగుతుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారట కుటుంబ సభ్యులు. మరి వీరి ప్రేమ వ్యవహారం ఇంతకీ పెళ్లి వరకు వెలుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.

తొలిసారి కలిసి

తొలిసారి కలిసి

కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫిబ్రవరి 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X