అందరి ముందు రణబీర్‌కి ముద్దిచ్చిన అలియా.. వైరల్ అవుతున్న వీడియో!

రణబీర్ కపూర్, అలియా భట్ ఘాటైన ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ ఏడాదే ఈ జంట పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఈవెంట్ లో వీరిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. మీడియా ముందు మాత్రం అలియా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదు. మా వ్యక్తిగత విషయాలు మీతో ఎందుకు చెప్పాలి అంటూ మీడియాకే ప్రశ్నలు వేస్తోంది. నా జీవితంలో ఏం జరిగినా నేను దాయను. అలాగని అందరి ముందు చెప్పుకోను అంటూ అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన వీరిద్దరూ తమ మధ్య ఎంత ఘాడమైన ప్రేమ ఉందొ బయట పెట్టారు.

జీ సినిమా అవార్డ్స్

జీ సినిమా అవార్డ్స్

అలియా భట్, రణబీర్ కపూర్ జీ సినిమా అవార్డ్స్‌కు హాజరయ్యారు. దీపికా, రణవీర్ సింగ్ దంపతులు కూడా వీరి పక్కనే కూర్చుని ఉన్నారు. ఈ సందర్భంలో చోటు చేసుకున్న సంఘటన అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రణబీర్ కపూర్, అలియా భట్ ఒకరికొకరు ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిగ్గుపడిన అలియా

సిగ్గుపడిన అలియా

జీ సినిమా అవార్డ్స్‌లో రాజి చిత్రానికి గాను అలియా భట్ బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌గా ఎంపికైంది. తన ప్రియురాలోకి అవార్డు రావడంతో రణబీర్ ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆమెని దగ్గరకు తీసుకుని లిప్ కిస్ ఇవ్వబోయాడు. కానీ అలియా భట్ సిగ్గుపడిపోయింది. లిప్ కిస్ కాకుండా చెంపపై ముద్దు పెట్టించుకుంది. రణబీర్ కపూర్‌కి కూడా అలియా తిరిగి ముద్దు ఇచ్చింది. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మోతెక్కిపోయింది.

 అలియా చేతుల మీదుగా

అలియా చేతుల మీదుగా

ఇదే ఈవెంట్‌లో రణబీర్ కపూర్‌ని కూడా ఓ అవార్డు వరించింది. సంజు చిత్రానికి గాను రణబీర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలియా భట్ స్వయంగా ఈ ప్రకటన చేసి తన ప్రియుడికి అవార్డు అందించింది. ఆ తర్వాత రణబీర్ తాన్ తండ్రి రిషి కపూర్ గురించి చాలా ఎమోషనల్‌గా ప్రసంగించారు. రణబీర్ ప్రసంగానికి అలియా కూడా కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం రిషి కపూర్ అనారోగ్యంతో బాధపడుతూ యూఎస్‌లో చికిత్స పొందుతున్నారు.

బాధలన్నీ మరచిపోతాం

రణబీర్ కపూర్ తల్లి నీతూ సోషల్ మీడియాలో స్పందించింది. అలియా, రణబీర్ అవార్డు అందుకున్న ఫోటోని పోస్ట్ చేసి.. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అన్ని బాధలని సులభంగా మరచిపోతాం అని స్పందించింది. ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా నటిస్తున్నారు. కింగ్ నాగార్జున, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X