For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ananya Boyfriend: అడ్డంగా దొరికిన సినీ జంట.. ఆ హీరోతో లైగర్ భామ డేటింగ్.. ఇద్దరి ప్రైవేట్ ఫొటో లీక్

  |

  మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ ఫీల్డులో లవ్ ట్రాకులు సర్వసాధారణంగా కనిపించే అంశాలని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, అక్కడ డేటింగ్‌లు, ఎఫైర్లు, ప్రేమ వివాహాలు, బ్రేకప్‌లు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు జంటగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అలా ఎంటర్.. ఫుల్ పాపులర్

  అలా ఎంటర్.. ఫుల్ పాపులర్

  బాలీవుడ్ దిగ్గజ నటుడు చుంకీ పాండే కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో అనన్య యాక్టింగ్‌తో మెప్పించి పాపులర్ అయింది.

  Bigg Boss Elimination: మళ్లీ ఊహించని ఎలిమినేషన్‌.. వాళ్లిద్దరి ఏవీలు రెడీ.. ఇంతకీ ఎలిమినేట్ ఎవరంటే!

  కొన్ని సినిమాలకే.. ఫుల్ క్రేజ్

  కొన్ని సినిమాలకే.. ఫుల్ క్రేజ్

  హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అనన్య పాండేకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు హిందీలో వరుసగా 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అలరించి నటిగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.

  లైగర్‌తో అనన్యకు బిగ్ షాక్

  లైగర్‌తో అనన్యకు బిగ్ షాక్

  కెరీర్ ఆరంభం నుంచీ అనన్య పాండే బాలీవుడ్ చిత్రాల్లోనే నటించింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై విమర్శలూ వచ్చాయి.

  బెడ్‌పై బ్రాతో దారుణంగా హీరోయిన్: ఈ అరాచకాన్ని చూశారంటే!

  ఆ చిత్రాలు.. ఆఫర్లు దూరం

  ఆ చిత్రాలు.. ఆఫర్లు దూరం

  మొదటి నుంచీ అనన్య పాండే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2' వంటి సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేయబోతుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో కొన్ని ప్రాజెక్టులు వచ్చినా 'లైగర్' ఫలితంగా అవన్నీ దూరం అయ్యాయి.

  స్టార్ హీరోతో అనన్య డేటింగ్

  స్టార్ హీరోతో అనన్య డేటింగ్

  వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న అనన్య పాండే.. తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అనన్య పాండే.. బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరోయిన్: ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ షో

  అక్కడకు జంటగా వచ్చారు

  అక్కడకు జంటగా వచ్చారు

  గతంలో జరిగిన కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా హాజరయ్యారు. అంతేకాదు, అక్కడ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్‌తో రచ్చ చేశారు. అప్పుడే వీళ్ల బంధం గురించి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలోనూ అనన్య, ఆదిత్య జంటగా కనిపించి ఆ వార్తలకు బలం చేకూర్చారు.

  ఇద్దరూ కలిసున్న పిక్ లీక్

  ఇద్దరూ కలిసున్న పిక్ లీక్

  మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఏకాంతంగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ బాలీవుడ్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక, ఈ డేటింగ్ న్యూస్‌పై ఇటు అనన్య ఫ్యాన్స్, అటు ఆదిత్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

  English summary
  Bollywood Stars Ananya Panday and Aditya Roy Kapur Met at Diwali party Recently. Now Their Dating Rumors Gone Hot Topic in B Town.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X