Ananya Panday: హీరోతో అడ్డంగా దొరికిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఆ ఫొటోలు బయటకు రావడంతో కలకలం
సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అందులోనూ బాలీవుడ్‌లోని హీరోలు, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాకులు మరింతగా ఉంటున్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్లు అక్కడ జంటగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ మధ్య లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీటికి ఇంకా బలం చేకూర్చే విధంగా వీళ్లిద్దరూ కలిసి తాజాగా స్పెయిన్‌లో రచ్చ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
అలా వచ్చి.. వరుస చిత్రాలు: దిగ్గజ నటుడు చుంకీ పాండే కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన యాక్టింగ్‌తో మెప్పించిన ఆమె పాపులర్ అయింది. దీంతో ఆ తర్వాత వరుసగా 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించింది. తద్వారా స్టార్‌గా ఎదిగింది.

టాలీవుడ్‌లో మాత్రం దెబ్బ: మొదటి నుంచీ అనన్య పాండే బాలీవుడ్ చిత్రాల్లోనే నటించింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి.

ఆ చిత్రాలు.. ఫుల్ బిజీగానే: అనన్య పాండే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2', కంట్రోల్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. అలాగే, Call Me Bae టీవీ సిరీస్‌లో సైతం నటిస్తోంది. వీటితో పాటు అనన్య పాండే కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

స్టార్ హీరోతో అనన్య ప్రేమ:ఏకధాటిగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న అనన్య పాండే.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అనన్య పాండే.. బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో లవ్‌లో ఉన్నట్లు బీ టౌన్ సమాచారం.

ఆ పార్టీలో జంటగా సందడి: ఆ మధ్య జరిగిన కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా హాజరయ్యారు. అంతేకాదు, అక్కడ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. అప్పుడే వీళ్ల బంధం గురించి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గత దీపావళి పార్టీలోనూ అనన్య, ఆదిత్య జంటగా కనిపించి ప్రేమ వార్తలకు బలం చేకూర్చారు.
మళ్లీ జంటగా.. స్పెయిన్‌లో: ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ బహిరంగంగా తమ బంధాన్ని మాత్రం బయట పెట్టలేదు. కానీ, జంటగానే తరచూ ట్రిప్పులకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా స్పెయిన్‌లో జరిగిన Arctic Monkeys concertలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. దీంతో వీళ్ల డేటింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

ఆ ఫొటోలు షేర్ చేయడంతో: ప్రస్తుతం స్పెయిన్‌లో జంటగా హల్చల్ చేస్తూ రెచ్చిపోతోన్న అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్.. తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో Arctic Monkeys concertకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. వీటిలో వీళ్లిద్దరూ కనిపించకున్నా.. అక్కడకు జంటగా వెళ్లారని అర్థం అవుతోంది. ఇక, ప్రస్తుతం వీళ్లు షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











