twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంధాదున్ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత.. షాక్‌లో సినీ ప్రముఖులు

    |

    బాలీవుడ్‌లో పలు చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన పర్వేజ్ ఖాన్ గుండెపోటుతో మరణించారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ముంబైలోని రూబీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే కానీ మార్గమధ్యంలోనే ఆయన మరణించారని వైద్యులు ధృవీకరించారు పర్వేజ్ ఖాన్ వయసు 55 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పర్వేజ్ ఖాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి

     గుండెపోటు రావడంతో

    గుండెపోటు రావడంతో

    పర్వేజ్ ఖాన్ సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే రూబీ హాస్పిటల్‌కు తరలించాం. హాస్పిటల్‌కు చేరుకొనే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. అంతకు ముందు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. గుండెపోటు రావడం ఇదే తొలిసారి అని ఆయన స్నేహితుడు నిషాంత్ ఖాన్ పేర్కొన్నారు.

    1986 నుంచి బాలీవుడ్‌లో

    1986 నుంచి బాలీవుడ్‌లో

    పర్వేజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే. 1986 నుంచి ఆయన బాలీవుడ్ చిత్రసీమలో పనిచేస్తున్నారు. 1992లో అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీ సినిమాతో యాక్షన్ డైరెక్టర్‌గా మారారు. షారుక్ ఖాన్ నటించిన బాజీగర్, బాబీ డియోల్ నటించిన సోల్జర్ సినిమాలతో మంచి గుర్తింపు పొందారు.

    రాంగోపాల్ వర్మ, శ్రీరాం రాఘవన్‌తో

    రాంగోపాల్ వర్మ, శ్రీరాం రాఘవన్‌తో

    దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అబ్ తక్ చప్పన్ సినిమా నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా పనిచేయడం ప్రారంభించారు. శ్రీ రాం రాఘవన్ దర్శకత్వం వహించిిన జానీ గద్దర్, ఏజెంట్ వినోద్, బద్లాపూర్ లాంటి చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలకు ఆయన యాక్షన్ డైరెక్టర్‌గా సేవలందించారు.

    Recommended Video

    కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
    హన్సల్ మెహతా షాక్‌తో సంతాపం

    హన్సల్ మెహతా షాక్‌తో సంతాపం

    హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన షాహిద్ సినిమాకు ఆయన స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ అవార్డు కూడా లభించింది. పర్వేజ్ ఖాన్ మృతితో హన్సల్ మెహతా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పర్వేజ్ ఖాన్ గొప్ప సాంకేతిక నిపుణుడు. షాహిద్ సినిమా షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించిన మత కల్లోల సన్నివేశాన్ని సింగిల్ షాట్‌లో పూర్తి చేశారు. గొప్ప టెక్నిషియన్‌ను, మంచి మనిషిని సినిమా పరిశ్రమ కోల్పోయింది అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు.

    English summary
    Andhadhun action director Parvez Khan died due to heart attack. Film maker Hansal Mehta tweeted that, Just heard that action director Parvez Khan is no more. We had worked together in Shahid where he executed the riots sequence in a single take. Very skilful, energetic and a good man. RIP Parvez. Your voice still rings in my ears!.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X