ఇలియానా ప్రియుడిలో విలన్ యాంగిల్!
నడుము సుందరి ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రుతో ప్రేమాయణం సాగిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరికి పెళ్లి జరిగిపోయిందనే ఊహాగాలు కూడా వినిపించాయి. ఆ వార్తలపై ఇలియానా ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ఇదిలా ఉండగా తాజగా ఆండ్రు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇలియానా తనకు నచ్చిన భారతీయ నటి అని ప్రేయసిపై ప్రశంసలు కురిపించాడు. ఇలియానా లాగే తనకు కూడా నటుడిగా మారాలనే కోరిక ఉందని, అవకాశం వస్తే బాలీవుడ్ చిత్రాల్లో విలన్ పాత్రలు చేస్తానని ప్రకటించాడు.

ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా చేస్తానని చెప్పుకొచ్చాడు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా బాలీవుడ్ వెళ్లిన తరువాత జోరు తగ్గింది. బాలీవుడ్ లో ఆరంభంలో కొన్ని ఆఫర్స్ వచ్చినా ఆ తరువాత నిలబడలేకపోయింది. ఇప్పుడుమళ్ళీ తెలుగులో రవితేజ, శ్రీనువైట్ల చిత్రం అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











