For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  దారుణమైన హింస.. కొడితే చెవి పగిలింది.. జీవితం నాశనం.. సల్మాన్ సన్నిహితుడి అరాచకాలు

  |

  బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నిర్వహించే బీయింగ్ హ్యుమన్ సంస్థ వివాదంలో చిక్కుకొన్నది. ఆ సంస్థ సీఈవో తనను లైంగికంగా వేధించాడని యాక్టర్, మోడల్ ఆండ్రియా డిసౌజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోడల్ ఫిర్యాదును స్వీకరించిన గామ్‌దేవీ పోలీసు స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

  సాహో సంచలనం:ప్రభాస్ స్టామినా‌కు ఫిదా.. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా..

  శారీరక వేధింపులు

  శారీరక వేధింపులు

  బీయింగ్ హ్యూమన్ సీఈవో మనీష్ మంధన లైంగికంగా, శారీరకంగా వేధించాడు. 2017 నవంబర్‌లో నాపై దాడి చేయడంతో నాకు చెవిటితనం వచ్చింది. విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాంతో నా ఆరోగ్యం దారుణంగా క్షీణించింది అని తన ఫిర్యాదులో ఆండ్రియా డిసౌజా పేర్కొన్నది.

  ఆరునెలలపాటు అనారోగ్యంతో

  ఆరునెలలపాటు అనారోగ్యంతో

  2017 జరిగిన దాడి గురించి అప్పట్లో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటే.. ఆ సమయంలో దాడికి గురి కావడంతో నా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆరు నెలలపాటు బెడ్ మీదే ఉన్నాను. నా సోదరికి ఈ విషయం తెలిసి జస్లోక్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స చేయించారు అని ఆండ్రియా డిసౌజా పేర్కొన్నది.

  మనీష్ మందనపై కేసు నమోదు

  మనీష్ మందనపై కేసు నమోదు

  ప్రస్తుతం నా ఆరోగ్యం పూర్తిగా నయమైంది. దాంతో మనీష్ మంధనపై ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యాను. సల్మాన్ ఖాన్ పేరు చెప్పుకొని అమ్మాయిలను హిసించే మనీష్‌కు గుణపాఠం చెప్పాలనుకొన్నాను. నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలను ఇలానే వేధించాడు అని ఆండ్రియా వెల్లడించింది.

  సల్మాన్ పేరు చెప్పి అరాచకాలు

  సల్మాన్ పేరు చెప్పి అరాచకాలు

  మనీష్‌పై ఫిర్యాదు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. అతడి ప్రవర్తనను బయటపెట్టడమే అని అండ్రియా చెప్పింది. తన పేరును ఎలా వాడుకొంటున్నాడో సల్మాన్ ఖాన్‌కు తెలియాలి. అతడిని ఆ సంస్థ నుంచి బయటకు పంపితే సల్మాన్‌ ఖాన్‌కు ఎంతో గౌరవం ఉంటుంది. మనీష్‌పై సల్మాన్ ఖాన్ చర్యలు తీసుకొంటాడని భావిస్తున్నాను అని డిసౌజా అభిప్రాయపడింది.

  మనీష్ మంధన అరెస్ట్‌కు

  మనీష్ మంధన అరెస్ట్‌కు

  అండ్రియాను దారుణంగా హింసించాడు. మనీష్ వేధింపులకు ఆమె చాలా బాధను అనుభవించింది. మనీష్‌పై కేసు నమోదు చేశాం. ఎఫ్ఐఆర్ కాపీలు చేతికందాయి. ఆండ్రియాకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే మనీష్‌ను అరెస్ట్ చేయిస్తాం అని ఆండ్రియా తరుఫు న్యాయవాది వెల్లడించారు.

  English summary
  Salman Khan’s Being Human clothing company finds itself in the midst of a controversy. Model-actor Andria D’Souza lodged an FIR with Gamdevi police station against the clothing brand’s CEO Manish Mandhana under section 325 (voluntarily causing grievous hurt) of the Indian Penal Code.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more