Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యువరాజ్ సింగ్ నన్ను కుక్కతో పోల్చాడు, తప్పునాదే.. వేదనకు గురైన నేహా ధూపియా భర్త!
క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్‌కు క్రీడా రంగంతో పాటు, చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిత్వంతోనే కోట్లమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. చాలా మంది ప్రముఖులు కూడా యూవీ అంటే ఇష్టపడతారు. మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేడీ ప్రస్తుతం బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ, అంగద్ ఇద్దరూ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు. కానీ వీరిద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
నో ఫిల్టర్ నేహా
అంగద్ బేడీ సతీమణి నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తోంది. నో ఫిల్టర్ నేహా కార్యక్రమం ద్వారా నేహా పలువురు సెలెబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తోంది. తాజగా నేహా ధూపియా తన భర్త అంగద్ బేడీనే ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన ప్రాణస్నేహితుడైన యువరాజ్ సింగ్ తో ఏర్పడ్డ మనస్పర్థల గురించి వివరించాడు.
కుక్కతో పోల్చాడు
అంగద్ బేడీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూవీ నా పట్ల మనస్తాపానికి గురైనట్లు ఉన్నాడు. ఇటీవల అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చదివాను. అది నా గురించే. కొంత మంది స్నేహితులని చూశాక.. వాళ్ళకంటే కుక్కలే నయం అని పోస్ట్ పెట్టాడు. యూవీ కుక్కతో పోల్చింది నన్నే. అతడు అంతలా భాదపడడానికి కారణం నేనే అని అంగద్ తెలిపాడు.
పెళ్ళికి పిలవలేదని
ఈ ఏడాది ఆరంభంలో నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం రహస్యంగా జరిగింది. కుటుంబ సభ్యులకు తప్ప వీరి పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. వివాహం పూర్తయ్యాక ఈ విషయాన్ని ప్రకటించారు. తన పెళ్ళికి పిలవలేదని యూవీ తనపై కోపంగా ఉన్నట్లు ఉన్నాడని అంగద్ తెలిపారు. కానీ నా వివాహం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. ఈ విషయాన్ని యూవీ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నట్లు అంగద్ తన సతీమణితో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
యూవీ అంటే ఎప్పటికీ ఇష్టమే
యూవీ అంటే తనకు ఎప్పటికీ ఇష్టమే అని అంగద్ తెలిపాడు. కానీ మా మధ్య ప్రస్తుతం ఫ్రెండ్ షిప్ సరిగా లేదు. చిన్నతనంలో ప్రాణస్నేహితుల్లా మెలిగాం. ఏదో ఒకరోజు యూవీకి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నా. నేహా ధూపియా చేసిన ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.