twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువరాజ్ సింగ్ నన్ను కుక్కతో పోల్చాడు, తప్పునాదే.. వేదనకు గురైన నేహా ధూపియా భర్త!

    |

    క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్‌కు క్రీడా రంగంతో పాటు, చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిత్వంతోనే కోట్లమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. చాలా మంది ప్రముఖులు కూడా యూవీ అంటే ఇష్టపడతారు. మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేడీ ప్రస్తుతం బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ, అంగద్ ఇద్దరూ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు. కానీ వీరిద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

    నో ఫిల్టర్ నేహా

    నో ఫిల్టర్ నేహా

    అంగద్ బేడీ సతీమణి నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తోంది. నో ఫిల్టర్ నేహా కార్యక్రమం ద్వారా నేహా పలువురు సెలెబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తోంది. తాజగా నేహా ధూపియా తన భర్త అంగద్ బేడీనే ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన ప్రాణస్నేహితుడైన యువరాజ్ సింగ్ తో ఏర్పడ్డ మనస్పర్థల గురించి వివరించాడు.

    కుక్కతో పోల్చాడు

    కుక్కతో పోల్చాడు

    అంగద్ బేడీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూవీ నా పట్ల మనస్తాపానికి గురైనట్లు ఉన్నాడు. ఇటీవల అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చదివాను. అది నా గురించే. కొంత మంది స్నేహితులని చూశాక.. వాళ్ళకంటే కుక్కలే నయం అని పోస్ట్ పెట్టాడు. యూవీ కుక్కతో పోల్చింది నన్నే. అతడు అంతలా భాదపడడానికి కారణం నేనే అని అంగద్ తెలిపాడు.

     పెళ్ళికి పిలవలేదని

    పెళ్ళికి పిలవలేదని

    ఈ ఏడాది ఆరంభంలో నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహం రహస్యంగా జరిగింది. కుటుంబ సభ్యులకు తప్ప వీరి పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. వివాహం పూర్తయ్యాక ఈ విషయాన్ని ప్రకటించారు. తన పెళ్ళికి పిలవలేదని యూవీ తనపై కోపంగా ఉన్నట్లు ఉన్నాడని అంగద్ తెలిపారు. కానీ నా వివాహం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. ఈ విషయాన్ని యూవీ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నట్లు అంగద్ తన సతీమణితో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

    యూవీ అంటే ఎప్పటికీ ఇష్టమే

    యూవీ అంటే ఎప్పటికీ ఇష్టమే

    యూవీ అంటే తనకు ఎప్పటికీ ఇష్టమే అని అంగద్ తెలిపాడు. కానీ మా మధ్య ప్రస్తుతం ఫ్రెండ్ షిప్ సరిగా లేదు. చిన్నతనంలో ప్రాణస్నేహితుల్లా మెలిగాం. ఏదో ఒకరోజు యూవీకి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నా. నేహా ధూపియా చేసిన ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.

    English summary
    Angad Bedi reveals why 'dear friend' Yuvraj Singh is upset with him. Actor Angad Bedi and Neha Dhupia had surprised the film fraternity, their fans and the media with the announcement of their hush-hush wedding in May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X