వాడు హ్యాపీగా ఉండాలి అంతే.... అబ్బాయి లవ్ ఎఫైర్ మీద బాబాయ్ హాట్ కామెంట్!
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, హాట్ బ్యూటీ మలైకా అరోరా తమ లవ్ ఎఫైర్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించిన ఈ జంట కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయిపోయిన సంగతి తెలిసిందే. మీడియా కంటపడేలా చట్టాపట్టాలేసుకుని తిరగడం, పార్టీలు, సినిమా పంక్షన్లకు కలిసి హాజరవ్వడం లాంటివి చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.
ఆ మధ్య ఇద్దరూ కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన తర్వాత ఎఫైర్ వ్యవహారం తారా స్థాయికి చేరిందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సైతం బాలీవుడ్లో ప్రచారం మొదలైంది. కరణ్ జోహార్ లాంటి టాప్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఇది నిజమే అనే సంకేతాలు ఇచ్చారు.

అనిల్ కపూర్ నుంచి గ్రీన్ సిగ్నల్
మరో వైపు అర్జున్ కపూర్‌కు బాబాయ్ అనిల్ కపూర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవల నేహా ధూపియా ఛాట్ షోలో పాల్గొన్న అనిల్ కపూర్ ఈ ఇద్దరి వ్యవహారంపై కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా పాజిటివ్‌గా స్పందించారు.

మా ఫ్యామిలీలో అందరి సపోర్ట్ ఉంటుంది
నాకు అర్జున్ గురించి బాగా తెలుసు. ఏయే విషయాలు అతడిని సంతోషంగా ఉంచుతాయో అర్థం చేసుకోగలను. అర్జున్ సంతోషంగా ఉంటే మేమూ హ్యాపీగా ఉంటాము. అతడు వ్యక్తిగతంగా ఏమైనా చేయనీయండి. ఆ విషయాల మీద నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మా ఫ్యామిలీలో అందరం కూడా ఎదుటి వ్యక్తిని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. వారికి సంతోషం కలిగించే ఏ విషయాలను మేము అడ్డుకోబోము అన్నారు.

ఫ్యామిలీకి పరిచయం చేశాడా?
మరి అర్జున్ కపూర్ తన గర్ల్ ఫ్రెండును ఫ్యామిలీకి పరిచయం చేశాడా? అంటే లేదనే అంటున్నారు. గడిచిన కొన్ని నెలల కాలంలో తన జీవితంలో, కుటుంబంలో ఊహించని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, అందుకే ఆమెను ఇంకా ఇంట్లో వారికి పరిచయం చేయలేదని అంటున్నాడు అర్జున్.

ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో
మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో పెళ్లి చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఓ అపార్ట్‌మెంట్ కూడా కొనుగోలు చేశారట. త్వరలో ఇద్దరూ అక్కడికి షిప్ట్ అవుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











