నా పొట్ట ఎందుకు కొడుతున్నావ్.. ప్రముఖ దర్శకనిర్మాతకు హీరో ప్రశ్న.. అసలు విషయం ఏంటంటే?

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కరణ్ జోహార్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. ఎంతో మంది వారసులను వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన చేతుల మీదుగా ఎంట్రీ ఇస్తున్నారంటే కచ్చితంగా విజయం సాధించినట్టే. అలాంటి కరణ్ జోహర్ తాజాగా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే నటుడిగానూ కరణ్ కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే నటన కంటే దర్శకనిర్మాతగానే ఎంతో సక్సెస్ అయ్యాడు. చూస్తుంటే కరణ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం క్వారంటైన్‌లో..

ప్రస్తుతం క్వారంటైన్‌లో..

కరోనా దెబ్బకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో సెలెబ్రిటీలు సైతం ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో పిల్లలు చేసే సందడిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు.

ఐ ఫర్ ఇండియా..

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు ఐ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఫేస్‌‌బుక్ ద్వారా నిర్వహించాడు. కరణ్ మొదలుపెట్టిన ఈ షోలో దాదాపు బాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. ఫేస్ బుక్ లైవ్ ద్వారా నిర్వహించిన ఈ షో ద్వారా దాదాపు 8 కోట్ల ఫండ్ సమకూరినట్టు తెలుస్తోంది.

కొత్త లుక్‌తో కరణ్ షాక్..

కొత్త లుక్‌తో కరణ్ షాక్..

అయితే తాను సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తండ్రి పాత్రలు చేసేందుకు సంసిద్దంగా ఉన్నానని దర్శక నిర్మాతలు తనను కూడా పరిగణలోకి తీసుకోండని కోరాడు. కరణ్ షేర్ చేసిన ఈ పోస్ట్, ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతోంది.

నా పొట్ట ఎందుకు కొడుతున్నావ్..

నా పొట్ట ఎందుకు కొడుతున్నావ్..

కరణ్ పోస్ట్‌పై బాలీవుడ్ సెలెబ్రిటీలెందరో కామెంట్ చేశారు. వీరందరిలో కెల్లా అనిల్ కపూర్ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. ‘నా పొట్ట కొట్టాలని ఎందుకు చూస్తున్నావ్' అంటూ తండ్రి పాత్రలకు తాను ఉన్నాను కదా అంటూ పరోక్షంగా కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X