స్టార్ హీరోకు జాక్‌పాట్... 18 ఏళ్ల నాటి సినిమాకి ప్రతియేటా రెమ్యునరేషన్, ఇప్పటి వరకు ఎన్ని కోట్లంటే?

భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోల పారితోషికం గురించి ప్రతియేటా చర్చ జరుగుతూనే ఉంటుంది. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు హీరోలు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే మరికొందరు మాత్రం తమకు చాలామంది దర్శక నిర్మాతలు రెమ్యునరేషన్ ఎగవేశారని.. తమ మొహమాటం కారణంగా ఎంతో నష్టపోయామని చెబుతుంటారు. పారితోషికాల విషయంలో కోతలు ఎదుర్కోన్నట్లు పలువురు హీరోలు కూడా బయటపెట్టారు. అలాంటిది.. ఒకే సినిమాకు దాదాపు 18 ఏళ్ల నుంచి ఓ హీరో రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఆ నటుడు ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్. హిందీ చిత్ర పరిశ్రమను శాసించే కపూర్ ఫ్యామిలీకి చెందిన ఈ దిగ్గజ నటుడు.. 1979లో హమారే తుమ్హారే మూవీలో చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఆ మరుసటి సంవత్సరం టాలీవుడ్ దర్శక దిగ్గజం బాపు దర్శకత్వంలో వంశ వృక్షం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు అనిల్ కపూర్. అనంతరం వో 7 దిన్, మేరి జంగ్, సాహెబ్, మొహబ్బత్, కర్మ, మిస్టర్ ఇండియా, తేజబ్, రామ్ లఖ్, రాఖ్వాలా, బేటా, జుడాయ్, తాల్ తదితర చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు అనిల్ కపూర్. 46 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Anil Kapoor Still Earning From Slumdog Millionaire After 18 Years Reveals Shocking Royalty Income

నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలను అనిల్ కపూర్ నిర్మించారు. అలాగే నేపథ్య గాయకుడిగానూ పలు గీతాలు ఆలపించి సత్తా చాటారు. హీరో రణ్‌వీర్ సింగ్ తల్లికి బంధువైన సునీత భావ్నానీతో అనిల్ కపూర్‌కు 1984లో వివాహం జరిగింది. ఈ దంపతులకు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్ సంతానం. వీరు కూడా సినీరంగంలో తమ సత్తా చాటుతూ తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హాలీవుడ్ సినిమాలలో నటించిన అతికొద్దిమంది భారతీయ నటుల్లో అనిల్ కపూర్ కూడా ఒకరు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మిషన్: ఇంపాజిబుల్- ఘోస్ట్ ప్రోటోకాల్ తదితర సినిమాలలో ఆయన నటించారు. 2022లో 75 మంది బెస్ట్ బాలీవుడ్ యాక్టర్స్ లిస్ట్‌లో అనిల్ కపూర్ స్థానం సంపాదించారు.

70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు అనిల్ కపూర్. ఈ ఏడాది ఇప్పటికే సుబేదార్ సినిమాను రిలీజ్ చేసిన ఆయన.. ప్రస్తుతం ఆల్ఫా, కింగ్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్.. ఈ ఏడాదితో 70 ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026లో పాల్గొని తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2008లో తాను నటించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ ద్వారా తాను ఇప్పటికీ సంపాదిస్తున్నానని అనిల్ కపూర్ తెలిపారు. ఈ సినిమా చేసి ఒకటిన్నర దశాబ్ధాలకు పైగా గడుస్తోంది. నిన్న కూడా స్లమ్‌డాగ్ మిలియనీర్ నుంచి నాకు రాయల్టీ కింద డబ్బులు వచ్చాయి. నిన్న 3 వేల పౌండ్లు ( 3.50 లక్షల రూపాయలు) వచ్చాయి. అలా ఇప్పటి వరకు నాకు 5 మిలియన్ పౌండ్లు (6.17 కోట్ల రూపాయలు) వచ్చినట్లు అనిల్ కపూర్ పేర్కొన్నారు. ఈ సినిమాను నేను రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించాను. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికే నేను ఆ సినిమా చేశానని ఈ నట దిగ్గజం పేర్కొన్నారు.

కాగా.. డానియల్ బోయల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీలో దేవ్ పటేల్, ఫ్రిదా పింటోలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో అనిల్ కపూర్ ఓ గేమ్ షోకు హోస్ట్‌గా ప్రేమ్ కుమార్ అనే పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీలలో ఆస్కార్ అవార్డ్‌లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Read more about: anil kapoor slumdog millionaire
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X