Shocking Incident హీరోతో అభిమాని చేయకూడని పని.. అదే హీరోయిన్‌కు జరిగితే?

యానిమల్ సినిమాతో భారీ పాపులారిటిని సంపాదించుకొన్న నటుడు బాబీ డియోల్. ఆ చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్రకు అనూహ్యమైన రెస్సాన్స్ వచ్చింది. దాంతో ఓవర్‌నైట్‌లో ఆయన స్టార్ యాక్టర్‌గా మారిపోయారు. కేవలం హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు సినిమాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన తన 55వ జన్మదినాన్ని ముంబైలో అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన వివరాల్లోకి వెళితే..

ముంబైలో జరిగిన బాబీ డియోల్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఆ సమయంలో భారీగా తోపులాట జరిగింది. అయితే అభిమానులను కంట్రోల్ చేయడానికి బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది. అయినా ఫ్రాన్స్ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Animal Fame Bobby Deol gets wierd Kiss from Fans on his 55th Birth Day Celebrations

తన కోసం వచ్చిన అభిమానులకు చాలా ఓపికగా ఫోటోలు, సెల్పీలకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా సెల్ఫీ కోసం వచ్చిన అమ్మాయి బాబీ డియోల్ బుగ్గపై ముద్దు పెట్టింది. వెంటనే ఆయన ఓ రకమైన షాక్‌కు గురయ్యారు. నిశ్శబ్దంగా వెనక్కి జరిగి నిలుచున్నాడు. వెంటనే అభిమాని చేసిన పనికి చిరు నవ్వు నవ్వుతూ కనిపించాయి.

Animal Fame Bobby Deol gets wierd Kiss from Fans on his 55th Birth Day Celebrations

బాబీ డియోల్‌ బుగ్గుపై లేడీ అభిమాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే ఇదే పని హీరోయిన్‌కు ఎవరైనా అబ్బాయి చేస్తే వారి పరిస్థితి ఏమిటి? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత బాబీ డియోల్‌కు భారీ ఆఫర్లు తడుపు తడుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ నటించిన తమిళ చిత్రం కంగువాలో ఎఫెక్టివ్ రోల్ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ నటించే NBK109 చిత్రంలో కూడా బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X