ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో యానిమల్ రికార్డు: ఒకేసారి 19 విభాగాల్లో.. రష్మికకు బిగ్ షాక్
సాధారణంగా ఏదైనా రంగంలో రాణించిన వారికి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. సినీ రంగానికి సంబంధించి దేశం మొత్తంలో చాలా రకాల పురస్కారాలను ఇస్తున్నారు. అందులో అన్ని సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చేందుకు తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards).
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ఇప్పటికే 68 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 69వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. దీన్ని పురస్కరించుకుని గత ఏడాది సినీ రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు అవార్డులను నిర్వహకులు అందించబోతున్నారు. ఈ మేరకు 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారు.

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం జనవరి 28వ తేదీన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే ఈ అవార్డులకు గానూ నామినేషన్స్ లిస్టును రివీల్ చేశారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీ హవా చూపింది.
మరికొద్ది రోజుల్లోనే ఎంతో గ్రాండ్‌గా జరగనున్న ఫిల్మ్‌ఫేర్ (హిందీ) అవార్డులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నామినేషన్స్‌లో 'యానిమల్' మూవీ ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. తద్వారా ఎక్కువ నామినేషన్స్ పొందిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచి రికార్డు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

తాజాగా వచ్చిన 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024' నామినేషన్స్‌లో 'యానిమల్' మూవీ నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు (బాబీ డియోల్', ఉత్తమ సహాయ నటుడు (అనిల్ కపూర్), ఉత్తమ సహాయ నటి (త్రిప్తి), ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ పాటలు, ఉత్తమ గాయకుడు (అరిజిత్), ఉత్తమ గాయకుడు (బూపిందర్), ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కాస్ట్యూమ్స్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ వీఎఫ్ఎక్స్ విభాగాల్లో నామినేషన్స్ దక్కాయి.

వాస్తవానికి 'యానిమల్' మూవీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. త్రిప్తి సపోర్టింగ్ రోల్ చేసింది. సినిమాలో ఈమె పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు 'ఫిల్మ్‌ఫేర్' అవార్డుల్లో సైతం త్రిప్తినే నామినేట్ అయింది.


Click it and Unblock the Notifications











