Chiranjeevi: భోళా శంకర్‌కు బిగ్ రిలీఫ్.. ఆ మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ హ్యాపీ
టాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అయిన దర్శకులు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి వంగా ఒకడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' మూవీతో సంచలనంగా మారిన అతడు.. అదే చిత్రాన్ని హిందీలోకి 'కబీర్ సింగ్' అనే టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం భారీ హిట్ అవడంతో అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఈ జోష్‌లోనే అతడు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'యానిమల్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని ఆగస్టు 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'యానిమల్' మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'యానిమల్' మూవీని అనివార్య కారణాల వల్ల డిసెంబర్‌కు వాయిదా వేశారని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. దీనికి కారణం అదే రోజున అంటే ఆగస్టు 11న చిరంజీవి 'భోళా శంకర్' మూవీ విడుదల కాబోతుంది. ఇప్పుడు 'యానిమల్' వాయిదా పడడంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఎక్కువ థియేటర్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా ఇది చిరంజీవి అండ్ టీమ్‌కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ కూడా ఆగస్టు 11వ తేదీనే విడుదల కాబోతుంది. దీనితో పాటు వచ్చినా 'భోళా శంకర్' చిత్రానికి పెద్దగా నష్టం చేకూరే అవకాశం ఉండదు. కానీ, ఈ ఇద్దరు సౌత్ స్టార్లతో వస్తే 'యానిమల్'కు మాత్రం తీవ్ర పోటీ ఉండేది. అందుకే దర్శక నిర్మాతలు రిలీజ్ విషయంలో వెనుకడుగు వేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











