Animal సరికొత్త చరిత్రను సృష్టించిన యానిమల్.. పబ్లిక్ డిమాండ్‌తో 24 గంటలపాటు షోలు

యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్నది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రమే కాకుండా పలు రకాలుగా పబ్లిక్ అటెన్షన్‌ను ఈ సినిమా క్రియేట్ చేస్తున్నది. గత ఎనిమిది రోజులుగా రిలీజైన ప్రతీ చోట ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. అయితే ఈ సినిమా నార్త్‌లో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ మహారాష్ట్రలో సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ ఘనత వివరాల్లోకి వెళితే..

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన యానిమల్ చిత్రం డిసెంబర్ 1వ తేదీన భారీ అంచనాలతో రిలీజైంది. తొలి ఆట నుంచి సంచలన రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తూ 500 కోట్ల క్లబ్‌లో సునాయసంగా చేరింది. ఇంకా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నది.

 Animal Movie Recreated History by Running Special show 24x7 in Mumbai

యానిమల్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీ వెర్షన్ సుమారుగా ఇండియా వైడ్ 550 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి 50 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా 565 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇది ఇలా ఉండగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లో యానిమల్ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. తొలివారంలో ఊహించని విధంగా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శిస్తున్నది. ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ భారీగా వస్తున్నారు. అయితే పబ్లిక్ నుంచి భారీ డిమాండ్ రావడంతో అదనపు షోలు ప్రదర్శిస్తున్నారు.

 Animal Movie Recreated History by Running Special show 24x7 in Mumbai

బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను 24 గంటలపాటు ప్రదర్శిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ సినిమాను ఉదయం 5.30 గంటల షో ను కూడా ప్రదర్శిస్తున్నారు. యానిమల్ సినిమా అదనపు షోలు అర్ధరాత్రి 1 గంటకు, అలాగే 2 గంటలకు ప్రత్యేకంగా షోలు ప్రదర్శిస్తున్నారు. అంధేరీలో అర్ధరాత్రి 12.30 గంటలకు, మరో షోనపు 1 గంటకు ప్రదర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X