Animal యానిమల్ సినిమా సక్సెస్ సొసైటికి డేంజర్.. ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్

సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. భారీ కలెక్షన్లతో పలు రికార్డులను క్రియేట్ చేసింది. అయితే అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత చర్చనీయాంశమయ్యాయి. ఈవెంట్‌లో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 Animal Movie success is danger bells to Industry and Society, Says Javed Akhtar

యానిమల్ సినిమా తీసిన నిర్మాతలే కాదు. ప్రేక్షకులు కూడా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే బూట్లు నాకే సీన్‌లో రణ్‌బీర్ నటించిన సన్నివేశం చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒక అమ్మాయిని హీరో నా బూట్లు నాకు. నీవు నా చెప్పులతో సమానం. మహిళను చెంప దెబ్బ కొడితే తప్పు ఏముంది? అని హీరోతో చెప్పించడం నచ్చలేదు. ఇలాంటి డైలాగ్స్ ఉన్న సినిమా సూపర్ హిట్ అయింది. ఇలాంటి డైలాగ్స్, సన్నివేశాలు ఉన్న సినిమా హిట్ కావడం ఇండస్ట్రీకి డేంజరస్ అని అన్నారు.

 Animal Movie success is danger bells to Industry and Society, Says Javed Akhtar

ఖల్ నాయక్ సినిమాలో ఛోలి కే పీచే పాటలో వచ్చినప్పుడు చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ.. ఏమున్నది ఆ పాటను ఇద్దరు రాశారు. ఇద్దరు డ్యాన్స్ చేశారు. ఒక కెమెరామెన్ తీశాడు. ఆ పాట హిట్ అయింది. ఇప్పుడు ఒక పాటను 5 గురు, 6 గురు రాస్తున్నారు. పాటలు హిట్ అవుతున్నాయి. ప్రాబ్లెం ఏమిటంటే.. అలాంటి పాటలను కూడా లక్షలాది మంది హిట్ చేస్తున్నారు అని జావెద్ అఖ్తర్ అన్నారు.

 Animal Movie success is danger bells to Industry and Society, Says Javed Akhtar

అయితే హిట్, ఫ్లాపుల విషయాలు పక్కన పెడితే.. ప్రేక్షకులు చాలా బాధ్యతగా ఉండాలి. ఎలాంటి సినిమాలను ఆదరించాలనే విషయంపై ప్రేక్షకులు జవాబుదారీగా ఉండాలి. విలువలు లేని సినిమాలను తిరస్కరించాలి. అప్పుడే సినిమా వాళ్లు మంచి సినిమాలు తీస్తారు అనే విధంగా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X