Animal Movie New Poster: రష్మిక, రణబీర్ తో లిప్ లాక్ - రొమాంటిక్ పోస్టర్ వైరల్!

Animal Movie New Poster: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచే ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలో రణబీర్, రష్మికలు నటించబోతున్నట్లు తెలిసి మరింత ఎగ్జైట్ అయ్యారు. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకుంటున్నారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. తాజాగా చిత్రబృందం మరో పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్నా, రణబర్ కపూర్ లు లిప్ లాక్ చేసుకునే ఫొటో అదిరిపోయింది. అయితే యానిమల్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపేందుకు ఈ పోస్టర్ ను క్రియేట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. తెలుగులో అమ్మాయి అనే టైటిల్ తో ఈ పాట విడుదల కాబోతుంది. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ కు యూత్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

Animal Movie Ranbir Kapoor

రష్మిక మందన్నా, రణబీర్ కపూర్ లు లిప్ లాక్ చేసుకుంటున్న ఫొటో ఉన్న ఈ పోస్టర్ ను.. క్రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. "హువా మై.. రేపు వస్తోంది. ఈ సాంగ్ ఓ ఫైర్. నాకు వ్యక్తిగతంగా అన్ని వెర్షన్లు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ చాలా నచ్చాయి" అనే క్యాప్షన్ తో రష్మిక ఈ పోస్టర్ ను పోస్ట్ చేసింది. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వగా కూడా షేర్ చేశారు. అయితే సందీప్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కూడా హీరోహీరోయిన్లు లిప్ లాక్ చేసుకునే పోస్టర్ ఉండడంతో.. అంతా ఈ రెండు సినిమాలను పోలుస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది.. మరి పాట ఎలా ఉంటుందో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టీ సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళీ పిక్చర్స్ కలిసి సినిమాను నిర్మించాయి. ఈ సినిమాను డిసెంబర్ ఒకటో తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ నటుడు అనిల్ కపూర్... రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు. అలాగే బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Animal Movie Team Released New Poster of Ranbir Kapoor And Rashmika Mandanna Lip Lcok Photo

ఇటీవల విడుదలైన టీజర్, నేడు రిలీజైన పోస్టర్ చూస్తుంటే.. సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. మరి రేపు రాబోయే ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో... అది సినిమాకు ఎంత ప్లస్సుగా మారుతుందో. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు ఫుల్లుగా రొమాంటిక్ సీన్లు కూడా ఉండనున్నాయి. మరి సినిమా రిలీజ్ అయి ఈ రేంజ్ లో హిట్టు కొడుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X