లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నటి ఇంట్లో మందుపార్టీ.. పోలీసుల కేసు నమోదు

కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి దేశం మొత్తం ఓ వైపు లాక్‌డౌన్ పాటిస్తుంటే.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఓ సీనియర్ నటి తన ఇంటికి స్నేహితులను పిలిచి మందు, విందు పార్టీలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒకవేళ ఆమె పార్టీ నిర్వహించినట్టు రుజువైతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నటికి ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే.

 లాక్‌డౌన్ సమయంలో పార్టీ?

లాక్‌డౌన్ సమయంలో పార్టీ?

హిందీ సినిమా, టెలివిజన్ రంగాల్లో మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్న అనితా రాజ్ వివాదంలో కూరుకుపోయారు. లాక్‌డౌన్ సమయంలో భర్త, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ముంబైలోని పాలి హిల్స్ రెసిడెన్స్‌లో విందు జరుపుకొన్నారనే వార్తలు వచ్చాయి. తన ఇంటికి ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

వాచ్‌మెన్, సెక్యూరిటీ ఫిర్యాదు

వాచ్‌మెన్, సెక్యూరిటీ ఫిర్యాదు

లాక్‌డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్స్‌కు తూట్లు పొడుస్తూ స్నేహితులను పిలిచి ఇంటిలో మద్యం పార్టీ నిర్వహించారు. కొన్ని రౌండ్లపాటు ఆల్కాహల్ సేవించారు. విందు హంగామా చూసి ఇరుగుపొరుగు వారు, సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇంటిలో సోదాలు నిర్వహించారు.

పోలీసుల తనిఖీలు, కేసు నమోదు

పోలీసుల తనిఖీలు, కేసు నమోదు

పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనితారాజ్, ఆమె భర్త సునీల్ ఇరుగుపొరుగు వారిపై, సెక్యూరిటిపై చిందులు తొక్కారు. తప్పుడు సమాచారం ఇచ్చి తమ ప్రతిష్టను గంగలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ వాచ్‌మెన్, సెక్యూరిటీతో గొడవ పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

 తప్పుడు సమాచారంతో కేసు నమోదు

తప్పుడు సమాచారంతో కేసు నమోదు

మందుపార్టీ నిర్వహణపై అనితారాజ్ స్పందించారు. నా భర్త డాక్టర్. ఆయన స్నేహితులకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. దాంతో వైద్యం కోసం ఆయన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా వారిని నా భార్త ఇంటిలోకి పిలిచారు. వారు ఇంటిలో ఉండగా పోలీసులు తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని క్షమాపణల కోరారు అని అనితా రాజ్ చెప్పారు.

Recommended Video

Mahesh Babu Tweet On Dhanush's Asuran Movie || ధనుష్ అదరగొట్టేసావ్..!!
అనితారాజ్ కెరీర్

అనితారాజ్ కెరీర్

అనితా రాజ్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ప్రేమ్ గీత్, జరా సా జిందగీ, జమీన్ ఆస్మాన్, మాస్టర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో పలు సీరియల్స్‌లో రాణిస్తున్నారు. కల్సర్ ఛానెల్స్‌లో ఛోటీ సర్దానీ సీరియల్‌లో కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం వివాదంలో కూరుకుపోయిన ఆమె ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X