ఆమె ఎంట్రీ ఇచ్చాకే సుశాంత్ భయ్యా పనైపోయింది, చుక్కలు చూపించింది: మాజీ అసిస్టెంట్ షాకింగ్ కామెంట్స్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి అసలు కారణం తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్టార్ సెలబ్రెటీ డెత్ సంచలనంగా మారింది. ఒక్కో కారణం వెనుక ఎన్నో అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇక ఇటీవల సుశాంత్ తో ఎక్కువగా కాలం ఉన్న మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య సుశాంత్ లవ్ స్టొరీ పై స్పందించారు.

మొదట్లో అమ్మయిల జోలికి వెళ్లకుండా

మొదట్లో అమ్మయిల జోలికి వెళ్లకుండా

సుశాంత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అమ్మయిల జోలికి వెళ్లకుండా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉంటేనే బావుంటుందనే ఆలోచనతో సుశాంత్ ఎక్కువగా ప్రయివేట్ పార్టీలకు వెళుతూ ఇతర హీరోయిన్స్ కి ఫ్రెండ్ అయ్యాడు. మొదట అంకితా లోఖండేతో డేటింగ్ చేసిన సుశాంత్ అనంతరం ఆమెతో కూల్ గానే బ్రేకప్ చెప్పేశాడు.

ఎప్పుడైతే రియా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చిందో

ఎప్పుడైతే రియా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చిందో

అప్పటివరకు బాగానే ఉన్న సుశాంత్ ఎప్పుడైతే రియా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ప్రశాంతతను కోల్పోయాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇక రీసెంట్ గా సుశాంత్ సింగ్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య కూడా ఈ విషయంపై స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. అవును అది ముమ్మాటికీ నిజమే అంటూ సుశాంత్ భయ్యా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసింది రియా చక్రవర్తి అంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

ఆయన మరణించిన రోజున..

ఆయన మరణించిన రోజున..

అంకిత్ మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ తో గత మూడేళ్ళుగా అసిస్టెంట్ గా ఉంటున్నాను. ఆయన మరణించిన రోజున రూమ్ లోపల గడియ పెట్టుకోవడం నాకు ఆశ్చర్యనికి గురి చేసింది. ఎందుకంటే ఒక్కరోజూ కూడా సుశాంత్ అలా చేయలేదు. గత ఏడాది నుంచి రియా రాకతో సుశాంత్ జీవితంలో చాలా మారిపోయాయి. ఒకసారి నేను విలేజ్ నుంచి తిరిగి వచ్చే సరికి ఇదివరకు సుశాంత్ దగ్గర పనిచేసిన వారు కనిపించలేదు.

 మానసిక వెధనలో ఉన్నాడని అర్ధమయ్యింది

మానసిక వెధనలో ఉన్నాడని అర్ధమయ్యింది

ఆ సిబ్బందిని రియా మార్చేశారు. ఇక బాడీ గార్డ్స్ ని సుశాంత్ కి చాలా దూరంగా ఉంచేవారు. ఇక చివరగా 2019సెప్టెంబర్ లో తనకు ఇవ్వాల్సిన డబ్బు కోసం సుశాంత్ ని కలవగా అతని మొహంలో ఏదో తెలియని డిప్రెషన్ కనిపించింది. నవ్వు అనేదే కనిపించలేదు. మానసిక వెధనలో ఉన్నాడని అర్ధమయ్యింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
 రియా విచ్చలవిడిగా ఖర్చు చేసింది

రియా విచ్చలవిడిగా ఖర్చు చేసింది

ఇక 2019లో సుశాంత్ ఎకౌంట్ లో 30కోట్ల వరకు ఉండాలి. ఆ డబ్బుని రియా విచ్చలవిడిగా ఖర్చు చేసింది. అలాగే రియా సుశాంత్ ఇంట్లో కొన్ని పూజలు కూడా చేసింది. అవి ఎలాంటి పూజలో నాకు అర్థం కాలేదు. ఒక దేవుడి విగ్రహం కూడా లేదు. అలాగే సుశాంత్ మెడిసిన్స్ కూడా పెద్దగా వాడేవాడు కాదు. అతనికి రియా నుంచి ఫోన్ వచ్చింది అంటే చాలు తీవ్ర స్థాయిలో మానసిక వేదనకు లోనయ్యేవాడు.. అని అంకిత్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X