నా తల్లి, మిలింద్ వయసు ఒకటే.. అందుకే నా భర్తను డాడీ అంటాను.. అంకిత సెన్సేషనల్
ఇండియన్ టాప్ మోడల్ మిలింద్ సోమన్, యంగ్ మోడల్ అంకిత కొన్వర్ పెళ్లి వార్త సినీ, వినోద పరిశ్రమ వర్గాలను షాక్ గురి చేసింది. ఎందుకంటే మిలింద్ సోమన్ వయసు 53 సంవత్సరాలు, అంకిత వయసు 28 ఏళ్లు. తన వయసు కంటే సగం వయసు ఉన్న అమ్మాయిని మిలింద్ 2018 ఏప్రిల్ 22న పెళ్లాడటం తెలిసిందే. అయితే తన తండ్రి వయసు ఉన్న మిలింద్ గురించి అంకిత ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

నాకు, నా భర్తకు 26 ఏళ్ల గ్యాప్
మిలింద్‌కు నాకు 26 ఏళ్ల గ్యాప్. నా తల్లి వయసు మిలింద్ వయసు ఒకటే. కానీ నాకు ఎలాంటి పట్టింపు లేదు. ప్రేమ, పెళ్లికి వయసు, ప్రాంతం, కులం, మతం అనేది అడ్డంకి కాదు. సమాజం రూపొందించిన కట్టుబాట్లు, అడ్డంకులే. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నప్పుడు కలిసి జీవించడం తప్పుకాదు కదా అని అంకిత అన్నారు.

నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం
తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకోనే హక్కు అందరికి ఉండాలి. అభిప్రాయాలు, ఫీలింగ్స్‌నే పరిగణనలోకి తీసుకోవాలి. నీకు నచ్చిందా సమాజాన్ని పక్కన పెట్టేయాలి. నాకు మిలింద్ అంటే ఇష్టం. నా కంటే వయసులో పెద్దైనా చేసుకొన్నాను. నా తల్లి వయసున్న మిలింద్‌ను ప్రేమగా డాడీ అని పిలుస్తాను అని అంకిత పేర్కొన్నారు.

ట్రోలింగ్‌ను ఎదిరిస్తూ
ఇటీవల కాలంలో మిలింద్, అంకిత సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్స్ బారిన పడుతుంటారు. వయసును ఆధారంగా చేసుకొని వారిని రకరకాల కామెంట్స్‌తో విసిగిస్తుంటారు. అయితే తమపై వచ్చే కామెంట్లకు ఈ క్రేజీ జంట ఘాటుగా స్పందిస్తుంటారు. తమను టార్గెట్ చేస్తూ ఉండటాన్ని లైట్‌గా తీసుకొంటారు.

టాప్ మోడల్‌గా మిలింద్
మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన ఈయన ప్రియురాలితో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











