ఈఎంఐలు సుశాంత్ కట్టలేదు.. ఆ 4కోట్లు నేనే కట్టుకున్నా.. ఆధారాలు బయటపెట్టిన మాజీ ప్రేయసి!

ఇంటర్నెట్ ప్రపంచంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి చెందిన అనేక రకాల వర్తలు కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యువ హీరో మరణించి దాదాపు రెండు నెలలు పూర్తవుతున్న కూడా ఇంకా మిస్టరీ వీడలేదు. రెండు రాష్ట్రాల పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతుండగా ఈడీ అధికారులు కూడా వారి స్టైల్ లో ఆర్థిక లావా దేవీలపై ఊహించని విషయాలని బయటకు లాగుతున్నారు.

4.5కోట్ల విలువైన ఫ్లాట్

4.5కోట్ల విలువైన ఫ్లాట్

ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండేకు సంబంధించిన షాకింగ్ రూమర్స్ కూడా నేషనల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబైలోని మలాద్ లో 4.5కోట్ల విలువైన ఫ్లాట్ ని కొనుగోలు చేసిన అంకిత ఆ డబ్బును సుశాంత్ ద్వారానే చెల్లించిందనే రూమర్స్ వచ్చాయి. ఈఏంఐలు మొత్తం కూడా సుశాంత్ కట్టాడు అని కథనాలు రాగా ఆ విషయంపై అంకిత వెంటనే క్లారిటీ ఇచ్చింది.

ఆధారాలు బయటపెట్టిన అంకిత

ఆధారాలు బయటపెట్టిన అంకిత

సుశాంత్ ఎకౌంట్ ని ఉపయోగించే అంకిత డబ్బులు లాగేసిందనే రూమర్స్ డోస్ మరింత ఎక్కువ కాకముందే ఆమె కొన్ని ఆధారాలను బయటపెట్టింది. బ్యాంక్ ఎకౌంట్స్ తో పాటు, ఆమె చెల్లించిన EMI స్టేట్మెంట్స్ కి సంబంధించిన వివరాలను కూడా అంకిత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అవి పూర్తిగా తన డబ్బులేనని ఎవరు సహాయం చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇంతకంటే నేను ఎక్కువగా ఏమి చెప్పలేను

ఇంతకంటే నేను ఎక్కువగా ఏమి చెప్పలేను

ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అంకిత బయటపెట్టగా అందరికి ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. నేను చాలా పారదర్శకంగా ఉంటాను. ఈ ఆధారాలు నా వద్ద ఉన్నాయి. తప్పకుండా వదంతులకు చెక్ పడుతుందని అనుకుంటున్నా. ఇంతకంటే నేను ఎక్కువగా ఏమి చెప్పలేను అని అంకిత్ తన ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
ఆమె వల్లే సుశాంత్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది

ఆమె వల్లే సుశాంత్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది

ఇక అంకితకి ఓ వైపు నెటిజన్స్ నుంచి మద్దతు చాలానే లభిస్తోంది. ఇక మరోవైపు సుశాంత్ మరణానికి ముందు వరకు అతనితో ప్రేమలో ఉన్న రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వేలువడుతున్నాయి. ఆమె వల్లే సుశాంత్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటూ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఇక ఆమె బ్యాంక్ ఖాతాలపై కూడా ఈడీ అధికారులు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. త్వరలోనే కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X