పబ్లిగ్గా అతడి పెదాలను ముద్దాడింది, వైరల్ అవుతున్న వీడియో
హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లోఖండే... ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఒకప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో లాంగ్ టైమ్ రిలేషన్ కొనసాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
అంకిత లోఖండే సైతం ఇటీవలే 'మణికర్ణిక' సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటు బాలీవుడ్లో కెరీర్ ప్రారంభం అవ్వడంతో పాటు బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారి విక్కీ జైన్‌తో ప్రేమలో పడటం ద్వారా జీవితాన్ని మరింత హ్యాపీగా లీడ్ చేస్తోంది.

లవ్ మ్యాటర్లో క్లారిటీ ఇచ్చిన అంకిత
అంకిత, విక్కీ జైన్ మధ్య ఎఫైర్ ఉన్నట్ల మీడియా సర్కిల్‌లో వార్తలు గుప్పుమనడంతో... ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను ప్రేమలో పడ్డమాట నిజమే. అతడు చాలా మంచి వ్యక్తి. బిలాస్‌పూర్‌కు బిజినెస్ మ్యాన్. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను'' అని హింట్ ఇచ్చారు.
పబ్లిగ్గా ముద్దు పెట్టి అతడే నా సర్వస్వం అంటూ....
ఇటీవల అంకిత, విక్కీ జైన్ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రియుడిని పబ్లిగ్గా ముద్దు పెట్టడం ద్వారా ఇతడే నా సర్వస్వం అనే మెసేజ్ అభిమానుల్లోకి పంపింది అంకిత. వీరి ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటను బ్లెస్ చేస్తూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?
విక్కీ జైన్‌ను ముద్దు పెట్టి అతడితో తన రిలేషన్ ఖరారు చేయడం ద్వారా ఇద్దరూ ఏకం కాబోతున్నామనే హింట్ ఇచ్చింది అంకిత. త్వరలో వీరి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సైతం తెరపైకి వచ్చాయి. అయితే అంకిత ఇటీవలే బాలీవుడ్లో కెరీర్ మొదలు పెట్టిన నేపథ్యంలో ఇప్పట్లో పెళ్లి ఉండక పోవచ్చని మరికొందరి అభిప్రాయం.

అంకిత లోఖండే
నిన్న మొన్నటి వరకు టీవీ నటిగా ఉన్న అంకిత లోఖండే... ‘మణికర్ణిక'తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో ఆమె ఝాల్కరిబాయి పాత్రలో నటించారు. హీరోయిన్ కంగనాకు సపోర్టుగా ఉండే పూర్తి నిడివిగల పాత్ర ఇది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ మూవీ తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం ఆమె వెయిట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











