రియా చక్రవర్తి కుట్రలకు అంకిత ఘాటైన కౌంటర్.. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత అంటూ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి సీబీఐ, ఈడీ, ఎన్సీబీ రంగంలో దిగి దర్యాప్తు చేస్తుంటే.. రియా చక్రవర్తి, అంకితా లోఖండే మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం మరింత వేడిని రాజేస్తున్నది. సుశాంత్ సింగ్‌కు ఉన్న డిప్రెషన్ కారణం తానే అంటూ రియా చక్రవర్తి చేసిన ఆరోపణలపై అంకితా ఘాటుగా స్పందించారు. రియా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ..

సుశాంత్‌కు డిప్రెషన్ లేదు
సుశాంత్ ఆరోగ్యం, మానసిక రుగ్మత గురించి రియా చక్రవర్తి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా కొన్ని వివరణలు ఇస్తున్నాను. సుశాంత్ సింగ్‌తో అఫైర్ మొదలై 2016 ఫిబ్రవరి వరకు కలిసి ఉన్న కాలంలో ఆయన ఎలాంటి డిప్రెషన్‌కు గురికాలేదు. నాకు తెలిసి సుశాంత్ ఎప్పుడూ సైక్రియాటిస్టును సంప్రదించిన దాఖలాలు లేవు. మేమిద్దరం కలిసి ఉన్న సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అంకితా తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పష్టం చేసింది.

సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత
సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత నేను ఎప్పుడూ ఆయనతో టచ్‌లో లేను. మేమిద్దరం విడిపోయిన ఆయనతో మాట్లాడిన సందర్బాలు కూడా లేవు. సుశాంత్ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్టు నేను ఎవరికీ చెప్పలేదు. ఏ మీడియాతో కూడా అనలేదు. మణికర్ణిక షూటింగులో ఉన్నప్పుడు మా ఇద్దరికి స్నేహితుడైన ముఖేష్ చాబ్రా ఇన్స్‌టాగ్రామ్‌లో సుశాంత్ నాకు బెస్టాఫ్ లక్ చెప్పారు. అంతకుమించి మా మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు అని అంకిత లోఖండే క్లారిటీ ఇచ్చారు.

సుశాంత్‌తో కలిసి ఉన్న సమయంలో
సుశాంత్ నేను కలిసి ఉన్న సమయంలో మా కెరీర్ గురించే ఎక్కువగా ఆలోచించే వాళ్లం. మా ఫ్యూచర్‌ను ఫ్లాన్స్ చేసుకొనే వాళ్లం. మా భవిష్యత్ గురించి గొప్పగా కలలు కంటే లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాళ్లం. సుశాంత్ మంచి సక్సెస్ లభించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను ప్రార్థించే దానిని అని అంకిత ఎమోషనల్ అయ్యారు.

రియా చక్రవర్తి గురించి తప్పుగా
ఇక రియా చక్రవర్తి గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె గురించి ఎవరైనా నన్ను అడిగితే నాకు తెలియదని స్పష్టంగా చెప్పేదానిని. సుశాంత్, రియా రిలేషన్‌షిప్ గురించి నాకు ఎలాంటి పట్టింపులు లేవు. నాతో కలిసి ప్రయాణించిన ఓ వ్యక్తి జీవితం అర్ధాంతరంగా ముగియడంతో ఆవేదన చెందాను. ఆ తర్వాతే నేను మాట్లాడటం ప్రారంభించాను. మా మధ్య జరిగిన విషయాలను, వాస్తవాలను చెప్పడానికే ప్రయత్నించాను అని అంకిత లోఖండే అన్నారు.
Recommended Video

నాపై బురద జల్లే ప్రయత్నం
నా ఫ్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు కూడా సుశాంత్ కడుతున్నారనే అపవాదును నాపై రుద్దడానికి కొందరు ప్రయత్నించారు. నాపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టాను. సుశాంత్ మరణం తర్వాత నాపై బురద జల్లడానికి ఓ వర్గం విపరీతంగా ప్లాన్ చేసింది. అందుకే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నా బ్యాంక్ అకౌంట్ల వివరాలను మీడియా ముందు పెట్టాను. దాంతో వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి అని అంకితా లోఖండే పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











