‘మణికర్ణిక’ వివాదం: ఆమె నుంచి ఎలాంటి కంప్లయింట్స్ లేవు!

హిందీ టీవీ నటి అంకిత లోఖండే 'మణికర్ణిక' ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె ఝాల్కరి బాయి అనే పాత్రలో నటించారు. జనవరి 25న విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది.

సినిమా విడుదల తర్వాత ఈ చిత్ర దర్శకుల్లో ఒకరైన క్రిష్ జాగర్లమూడి మీడియా ముందుకు వచ్చి వివాదానికి తెరలేపారు. ఈ ప్రాజెక్టు నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, కంగనా తన పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది, ఆమె దర్శకత్వ బాధ్యతలు చేజిక్కించుకోవడానికి ఎలాంటి డ్రామాలు ఆడిందనే విషయాలు బయట పెట్టారు.

నా సీన్లు కట్ చేయలేదు

నా సీన్లు కట్ చేయలేదు

క్రిష్‌కు మద్దతుగా మాట్లాడుతూ... ఇప్పటికే ఈ చిత్రంలో కాశీభాయి పాత్ర పోషించి మిష్టి చక్కవర్తి తన పాత్ర నడివి కంగనా చాలా వరకు తొలగించిన విషయాన్ని బయటపెట్టారు. అయితే అంకిత మాత్రం తన పాత్రకు సినిమాలో ఎలాంటి కత్తిరింపులు పెట్టలేదని తెలిపారు.

వారి గొడవ గురించి తెలియదు

వారి గొడవ గురించి తెలియదు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంకిత మాట్లాడుతూ.. ‘కంగనా, క్రిష్ మధ్య జరుగుతున్న వివాదం గురించి నాకు తెలియదు కాబట్టి. దాని గురించి ఏమీ మాట్లాడలేను. నేను చేసిన సన్నివేశాలను కుదించడం కానీ, డిలీట్ చేయడం కానీ చేయలేదు. నా వైపు నుంచి ఎలాంటి కంప్లయింట్స్ లేవు' అన్నారు.

ఇదీ వివాదం...

ఇదీ వివాదం...

‘మణికర్ణిక' విషయంలో క్రిష్, కంగనా మధ్య గొడవకు కారణం సినిమాలోని సదాశివరావు అనే పాత్ర విషయంలో వచ్చిన విబేధాలే. ఈ పాత్రలో మార్పులు చేయాలని కంగనా కోరడంతో అది చరిత్రను వక్రీకరించినట్లు అవుతుందని క్రిష్ అడ్డుచెప్పారు. ఈ వివాదం ముదిరి చివరకు కంగనా దర్శకత్వ బాధ్యతలు చేజిక్కించుకునే వరకు వెళ్లింది.

క్రిష్ మీడియాకు ఎక్కవడానికి కారణం ఇదే..

క్రిష్ మీడియాకు ఎక్కవడానికి కారణం ఇదే..

అయితే క్రిష్ మీడియా ముందుకు వచ్చి వివాదం రేపడానికి కారణం ఈ సినిమాలో తాను చేసిన పనికి తగిన గుర్తింపు ఇవ్వక పోవడమే. 70 శాతం సినిమా తాను చిత్రీకరించిందే అయినా... కంగనా తానే తీసినట్లు సినిమాలో క్రెడిట్స్ వేసుకుంది. తన పేరు కూడా ఎవరూ గుర్తు పట్టలేని విధంగా వేయడం కూడా క్రిష్‌కు ఆగ్రహం తెప్పించింది.

దాన్ని జీర్ణించుకోలేకపోతున్న క్రిష్

దాన్ని జీర్ణించుకోలేకపోతున్న క్రిష్

కంగనా అనుకున్నది సాధించడం కోసం.... తన దర్శకత్వ ప్రతిబను, పనితీరు తప్పుబట్టే ప్రయత్నం చేయడం కూడా క్రిష్ జీర్ణించుకోలేకపోయారు. సినిమా విడుదల తర్వాత కంగనా ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో ఆయన మీడియా ముందు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X