For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్ నా ఫేవరేట్.. కానీ పెళ్లి అతనితోనే.. క్లారిటీ ఇచ్చిన మాజీ ప్రేయసి!

  |

  బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వత బాలీవుడ్‌లో నెపోటిజం, డ్రగ్స్‌ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇక సుశాంత్‌ మరణించిన నాటి నుంచి ఆయన అభిమానులు కొందరు రియా చక్రవర్తి అలాగే సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండేని టార్గెట్‌ చేస్తూ.. ట్రోల్‌ చేసేవారు. ఆ విషయం ఇప్పటికీ కొనసాగుతోంది అనుకోండి. అయితే తాజాగా సుశాంత్ గురించి అంకితా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  పవిత్ర రిష్తాతో పాపులర్

  పవిత్ర రిష్తాతో పాపులర్

  'పవిత్ర రిష్తా' అనే హిట్ సీరియల్‌లో అర్చన దేశ్ ముఖ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న అంకితా లోఖండే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌తో జరిగిన చిట్ చాట్‌లో టీవీ నటి అంకితా లోఖండే తన అభిమాన కో స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అని చెప్పుకొచ్చింది. ఆయనే నాకు ఇష్టమైన నటుడని నేను భావిస్తున్నాను" అని అంకిత పేర్కొన్నారు. ఇక అంకిత మరియు సుశాంత్ 2016 లో విడిపోయే ముందు ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు.

  సుశాంత్ మరణంతో

  సుశాంత్ మరణంతో

  సుశాంత్ గత సంవత్సరం ఆత్మహత్య చేసుకుని అనుమాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ మరణించినప్పటి నుండి ఆమెను ద్వేషిస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు సమాధానం ఇవ్వడానికి అంకిత ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొంది. సుశాంత్ అభిమానులకు తమ గతం గురించి ఏమీ తెలియదని పేర్కొన్న ఆమె ఆయన కెరీర్ పై దృష్టి పెట్టాలని కోరుకున్నందున ఇద్దరం విడిపోయామని ఆమె అన్నారు.

  మీరు ఎక్కడ ఉన్నారు?

  మీరు ఎక్కడ ఉన్నారు?

  సుశాంత్ ఎప్పుడూ తన జీవితంలో ఎదగాలని కోరుకున్నానని పేర్కొన్న ఆమె అతను కూడా అలానే కోరుకున్నారని పేర్కొంది. ఈ రోజు నా వైపు వేళ్లు చూపే వారికి మా రిలేషన్ గురించి ఏమీ తెలియదు, మీరు సుశాంత్ సింగ్ ను నిజంగా ప్రేమిస్తే, ఇప్పుడు మీరు ఎందుకు పోరాడుతున్నారు? మా రిలేషన్ ముగిసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని ఆమె ప్రశ్నించింది. ఇక నేను ఎటువంటి తప్పు చేయకుండానే నిందించబడుతున్నానని చెప్పుకొచ్చింది.

  సుశాంత్ తన దారి తాను చూసుకున్నాడు

  సుశాంత్ తన దారి తాను చూసుకున్నాడు

  ''సుశాంత్ తన దారి తాను చూసుకున్నాడు, దానికి నేను ఎలా కారణమని ప్రశ్నించిన ఆమె నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? నేను ఏమి తప్పు చేశాను? అని ఆమె ప్రశ్నించింది. నా కథ ఏమిటో మీకు తెలియదు, కాబట్టి నన్ను నిందించడం మానేయండని ఆమె కోరింది. అలాగే అంకిత తన ప్రేమకు నిర్వచనం కూడా చెప్పుకొచ్చింది. "నాకు, ప్రేమ అవసరం. నాకు ప్రతిచోటా ప్రేమ అవసరం, అది నా ఆహారం లాంటిది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమ ఉండాలి. నేను ఎంచుకున్న అన్ని విషయాల్లో ప్రేమ ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది.

  పర్ఫెక్ట్ డేట్

  పర్ఫెక్ట్ డేట్

  ఒక పర్ఫెక్ట్ డేట్ గురించి చెప్పమంటే "నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేను కానీ నేను ప్రేమను ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను నా భాగస్వామితో ఉంటే చాలు నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకోను అని పేర్కొంది. ఎక్కడ ఉన్నా ఆయనతో కలిసి టీ తాగినా చాలు అని ఆ సమయాన్ని ఆయనతో కలిసి పంచుకోవాలి, అంతే, అని ఆమె చెప్పుకొచ్చింది.

  Sushant Singh Rajput ఫ్యాన్స్‌ పై Salman Khan ప్రేమ, Sushant ఇష్యూ ఇక్కడితో ఆగిపోయినట్టేనా ?
  అలా పెళ్లి ఇష్టం

  అలా పెళ్లి ఇష్టం

  తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి అంకిత మాట్లాడుతూ, త్వరలో జరగబోయే వివాహం గురించి నేను చాలా సంతోషిస్తున్నాను, నేను దాని కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. జైపూర్-జోధ్పూర్, రాజస్థానీ వివాహాలు నాకు చాలా ఇష్టం అని పేర్కొన్న ఆమె ఏమి ప్లాన్ చేస్తారో నాకు ఖచ్చితంగా తెలియదని పేర్కొంది. సుశాంత్ తో బ్రేకప్ తరువాత అంకితకు విక్కీ జైన్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నారు.

  English summary
  Actress Ankita Lokhande, who became popular with her role as Archana Deshmukh in the hit serial 'Pavitra Rishta'. And she became most popular for dating with Sushanth singhrajput. In a recent interview she opened up about her marriage plans with Vicky Jain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X