For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్‌పై మాజీ ప్రియురాలు సంచలన వ్యాఖ్యలు: మొత్తం అతడే చేశాడంటూ అసలు మేటర్ రివీల్ చేసిన హీరోయిన్

  |

  సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ సెన్సేషన్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. బాలీవుడ్‌లోకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అదే సమయంలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  సీరియల్ సమయంలోనే ఆమెతో ప్రేమాయణం

  సీరియల్ సమయంలోనే ఆమెతో ప్రేమాయణం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాల్లోకి రాకముందే కొన్ని సీరియళ్లలో నటించాడన్న విషయం తెలిసిందే. అలా ఓ ధారావాహికలో చేస్తున్న సమయంలోనే హీరోయిన్ అంకిత లోఖండేతో అతడు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత రహస్యంగా వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇలా ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత అంటే 2016లో వీళ్లిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే.

  సినిమాల్లోకి ఎంట్రీ.. రియా చక్రవర్తితో లవ్ ట్రాక్

  సినిమాల్లోకి ఎంట్రీ.. రియా చక్రవర్తితో లవ్ ట్రాక్

  ‘కోయి పో చే' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌ ‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో భారీ స్థాయిలో నటించి అందరి దృష్టిలో పడ్డాడు. అదే సమయంలో ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత మరో హీరోయిన్ రియా చక్రవర్తితో డీప్ రిలేషన్‌ను కొనసాగించాడీ స్టార్.

  ఊహించని విధంగా ఆత్మహత్య... అంకిత మీదే

  ఊహించని విధంగా ఆత్మహత్య... అంకిత మీదే

  సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. డిప్రెషనే దీనికి ప్రధాన కారణం అని పోలీసులు ప్రథమికంగా నిర్ధారించారు. కానీ, అదే సమయంలో చాలా అనుమానాలు తెరపైకి వచ్చాయి. సరిగ్గా అప్పుడే అతడి మాజీ ప్రియురాలు అంకిత వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుందని.. ఆ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగింది.

  సుశాంత్‌పై అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు

  సుశాంత్‌పై అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని దాదాపు పది నెలలు కావొస్తున్నా.. అంకిత ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు పలు పోస్టులు చేసింది. అలాగే, సుశాంత్‌కు న్యాయం చేయాలని డిమాండ్లు వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హీరోయిన్ అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  మొత్తం అతడే చేశాడంటూ మేటర్ రివీల్ చేసింది

  మొత్తం అతడే చేశాడంటూ మేటర్ రివీల్ చేసింది

  సుశాంత్ ఆత్మహత్యకు కారణాల్లో తానూ ఒకటి అంటూ వచ్చిన కామెంట్లపై అంకిత తాజాగా స్పందించింది. ‘సుశాంత్‌ను నువ్వే వదిలేశావు అని అందరూ నన్ను అంటున్నారు. కానీ, నిజం ఎవరికీ తెలియదు. నేను సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం నేను ఎంతగానో పరితపించాను. కానీ, అతడే తన కెరీర్‌ కోసం నన్ను.. నా ప్రేమను కాదనుకున్నాడు' అని కీలక మేటర్‌ను రివీల్ చేసిందామె.

  పెళ్లి చేసుకోవాలన్న ఆశతో అవన్నీ వదిలేశాను

  పెళ్లి చేసుకోవాలన్న ఆశతో అవన్నీ వదిలేశాను

  దీనిని కంటిన్యూ చేస్తూ.. ‘నాకు షారుఖ్‌ఖాన్‌తో కలిసి ‘హ్యాపీ న్యూ ఇయర్‌'.. సంజయ్‌లీలా భన్సాలీ ‘బాజీరావ్‌ మస్తానీ'లో, సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌', వరుణ్ ధావన్ ‘బద్లాపూర్'లలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. కానీ, సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం అవన్నీ వదులుకున్నాను. ఆ ఆఫర్లు పోయినందుకు నేనేమీ పెద్దగా చింతించలేదు' అంటూ అంకిత లోఖండే చెప్పుకొచ్చింది.

  Sushant Singh Rajput ఫ్యాన్స్‌ పై Salman Khan ప్రేమ, Sushant ఇష్యూ ఇక్కడితో ఆగిపోయినట్టేనా ?
  రెండున్నర సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించా

  రెండున్నర సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించా

  సుశాంత్‌తో బ్రేకప్ గురించి చెబుతూ.. ‘నేను సుశాంత్‌ను వదులుకోలేదు. అతనే నాకంటే కెరీర్‌ ముఖ్యమని అన్నాడు. అందుకే విడిపోవాల్సి వచ్చింది. అతని నిర్ణయానికి నేను గౌరవం ఇచ్చాను. అతను అలాగే ముందుకు వెళ్లిపోయాడు. సుశాంత్‌తో విడిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించానో ఎవరికీ తెలియదు' అంటూ ఎమోషనల్ అయింది అంకిత.

  English summary
  Actress Ankita Lokhande, who dated actor Sushant Singh Rajput for several years, opened up about how the break-up had affected her life and career after their split. Ankita Lokhande and Sushant Singh Rajput fell in love while starring on the TV show Pavitra Rishta, which made stars out of both the actors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X