నువ్వు చేసిన పనుల వల్లే నీకు ఈ దుస్థితి.. రియాపై సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ కామెంట్స్
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు రోజుకో మలువు తిరుగుతోంది. అయితే ఈ బాలీవుడ్ యాక్టర్ మరణానికి అసలు కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు గాని చుట్టూ ఉన్న వివిధ అంశాల రహస్యాలు మాత్రం బయటపడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు బయటకు రావడంతో సరికొత్త సంచలనానికి దారి తీసింది. ఇక ఆ కేసులో రియా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే స్పంధించింది.
Recommended Video

ఓ వైపు సీబీఐ మరోవైపు NCB
సుశాంత్ ఎప్పుడైతే మరణించాడో ఆ రోజు నుంచి కూడా రియా లైఫ్ ఒక్కసారిగా తారుమారయ్యింది. ఓ వైపు సీబీఐ మరోవైపు NCB అధికారులు ఊహించని విధంగా ఇన్వెస్టిగేషన్స్ తో రియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఫైనల్ గా ఆమె డ్రగ్స్ వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో తప్పించుకునే దారి మూసుకుపోయింది.

ఎవరి కర్మకు వారే భాద్యులు
ఇక ఈ విషయంపై సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఎవరి కర్మకు వారే భాద్యులు అంటు రియా చేసిన పనుల వల్ల చివరికి ఆమెనే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విధంగా వివరణ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నువ్వు చేసిన పనుల వల్లే..
ఏ విషయంలో అయినా సరే ఏది కూడా దానంతట అదే జరగదు.. కేవలం నువ్వు చేసిన పనుల వల్లే దురదృష్టాని కొని తెచ్చుకున్నావు అని క్లియర్ గా వివరణ ఇచ్చిన అంకిత జస్టిస్ అంటూ సింపుల్ గా కామెంట్ చేసింది. గతంలో కూడా రియాపై అంకిత కాస్త అసంతృప్తిగానే కామెంట్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్లు చెప్పింది.

ఆన్ లైన్ కోర్టు ద్వారా..
ఇక రియాకు నిన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరిక్షలు కూడా నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అనంతరం ఆమెను NCB కార్యాలయానికి తరలించారు. ఇక అక్కడే రియాను ఆన్ లైన్ కోర్టు ద్వారా న్యాయవాది ముందు రియాను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











