సుశాంత్ కేసు సీబీఐకి అప్పగింత...అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు
ఎన్నో రోజుల నుంచి సుశాంత్ అభిమానులు కలలు కన్న రోజు వచ్చేసింది. సుశాంత్ మరణంపై అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరూ సీబీఐ దర్యాప్పు కోసం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సీబీఐ దర్యాప్తుకు అనుమతివ్వాలని బీహార్ సీఎం చేసిన విజ్ఞప్తిని కేంద్రం మన్నించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించినట్టు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే కూడా ఎంతో సంతోషించింది. ఈ మేరకు ఆమె చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

మొదటి నుంచి..
సుశాంత్ సింగ్ మరణం సంభవించిన దగ్గరి నుంచి అంకితా లోఖండే ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేసిన వారిలో అంకిత ఒకరు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడు కాదని చెబుతూ వచ్చేది. సుశాంత్ మరణంతో అంకిత తీవ్ర భావేద్వేగానికి లోనైంది.

రియా చుట్టు ఉచ్చు..
సుశాంత్ కేసులో రియా చక్రవర్తి హస్తం ఉందని మొదటి నుంచి అంకిత భావించినట్టు కనిపిస్తోంది. సుశాంత్ తండ్రి రియాపై ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు రియా గురించి వేట కొనసాగించినప్పుడు అంకిత చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిజం ఎప్పటికీ గెలుస్తుందంటూ రియాను ఉద్దేశించి అంకిత పేర్కొంది.

సీబీఐ చేతికి సుశాంత్ కేసు..
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండని గత నెల నుంంచి సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించసాగాయి. ఇక ముంబై పోలీసుల విచారణతో విసుగెత్తిన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో రియాపై ఫిర్యాదు చేశారు. పాట్నా పోలీసులు రంగంలోకి దిగడంతో కేసులో వేగం పుంజుకుంది. సుశాంత్ తండ్రి కోరిక మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని కోరాడు. ఈ మేరకు కేంద్రం కూడా అంగీకరించింది.
Recommended Video

సమయం ఆసన్నమైంది..
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అంకిత స్పందిస్తూ.. ‘ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఘట్టానికి సమయం వచ్చింది' అని పేర్కొంది. ఇక అంకిత చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంకితాయే నిజమైన స్నేహితురాలని, ప్రేయసి అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











