»   » లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా? నీ తీరుపై అనుమానం!

లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా? నీ తీరుపై అనుమానం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా...?

  బాలీవుడ్ ముద్దుగుమ్మ తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ లైంగిక వేధింపుల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. పదేళ్ల క్రితం హర్న్ ఓకే ప్లీజ్ షూట్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ చేసిన ఆరోపణలపై బాలీవుడ్ ప్రముఖులు తలో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నటుడు, గాయకుడు, టెలివిజన్ హోస్ట్ అను కపూర్ తన స్పందనను వ్యక్తం చేశారు. తను శ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలపై పలు సందేహాలను వ్యక్తం చేశారు. అను కపూర్ ఏమన్నారంటే..

  దోషికి శిక్ష పడాల్సిందే

  దోషికి శిక్ష పడాల్సిందే

  తను శ్రీ దత్తాని నానా పాటేకర్ లైంగికంగా వేధిస్తే మహిళల మనోభావాలు దెబ్బతిన్నట్టే భావించాలి. ఒకవేళ అందే నిజమైతే ఎవరైనా శిక్షను తప్పించుకోలేరు. అది నానా పాటేకర్ అయినా, అను కపూర్ అయినా శిక్ష అనుభవించాల్సిందే. రుజువులుంటే దోషికి శిక్ష పడుతుంది అని అను కపూర్ అన్నారు.

  ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

  ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

  రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే వాటిపై అనేక సందేహాలు వస్తాయి. ఆరోపణలపై ఎగిసిపడే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. నీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లో కేసు ఎందుకు పెట్టలేదు. మీడియా విచారణను ఎందుకు కోరుకొంటున్నావు అని అను ప్రశ్నించారు.

  మీడియా సహకారం ఎందుకు

  మీడియా సహకారం ఎందుకు

  పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, చట్టాల సహకారం తీసుకోకుండా మీడియా సహాయాన్ని ఎందుకు కోరుకుంటున్నావు. ఇలా మీరు వ్యవహరించడం వల్ల మీ ఆరోపణలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  తనుశ్రీ దత్తాకి లీగల్ నోటీసులు

  తనుశ్రీ దత్తాకి లీగల్ నోటీసులు

  తమపై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై నానా, వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ వివాదంలో తనుకు వారిద్దరూ లీగల్ నోటీసులు పంపించారు. తమ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.

  పుణేలో ఎంఎన్ఎస్ కేసు నమోదు

  పుణేలో ఎంఎన్ఎస్ కేసు నమోదు

  ఇటీవల ఈ వివాదంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రేపై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. పుణేలో తను శ్రీపై కేసు నమోదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసి రాజ్ థాక్రేను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు.

  English summary
  After Tanushree Dutta alleged that Nana Patekar had sexually harassed her, several Bollywood celebrities talked about the same. Now, noted actor and TV presenter Annu Kapoor has shared his point of view on the same issue. The actor believes that Tanushree, who has accused Nana Patekar of sexually harassing her should approach the police instead of talking to the media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more