తమన్నా బాధపడి ఉంటే కాళ్లు పట్టుకుంటా.. సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్స్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయంతో మెప్పిస్తున్నారు. అటు నార్త్, ఇటు సౌత్ అనే తేడా లేకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే.. గతంలో ఓ బాలీవుడ్ సీనియర్ నటుడు ఆమెపై చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై స్పందిన ఆ నటుడు.. అవసరమైతే ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇంతకీ ఆ సీనియర్ నటుడు ఎవరు? అసలేం జరిగింది? ఎందుకు ఈ వివాదం రేగింది?

ఆ బాలీవుడ్ సీనియర్ నటుడు ఎవరో కాదు.. అన్నూ కపూర్‌ (Annu Kapoor). ఆయన గతంలో తమన్నాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. తమన్నా బాగా డ్యాన్స్‌ చేస్తారన్న అన్నూ కపూర్‌ ఆమె (Tamannaah) చాలా తెల్లగా ఉంటుందని హిందీలో చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనిపై తాజాగా వివరణ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నూ కపూర్.. తమన్నాను ఉద్దేశించి చేసిన 'దూధియా బదన్' (మిల్కీ బ్యూటీ) వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన మాటలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.

Annu Kapoor Ready to Apologize to Tamannaah After Viral Remark Controversy

ఈ వివాదం మొదలైంది ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో.. సమకాలీన పాటలు, హీరోయిన్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో హోస్ట్ తమన్నా గురించి ప్రస్తావించగా.. అన్నూ కపూర్ ఆమె అందం, డ్యాన్స్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా స్త్రీ 2 (Stree 2) సినిమాలోని ఆజ్ కీ రాత్ (Aaj Ki Raat) పాటలో తమన్నా ప్రదర్శన తనను ఆకట్టుకుందని చెప్పారు. అదే సమయంలో "మాషా అల్లాహ్.. క్యా దూధియా బదన్ హై' అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలే పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను ప్రశంసగా తీసుకోగా, మరికొందరు మహిళ శరీరాకృతిపై కామెంట్ చేయడం సరికాదని విమర్శించారు.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన అన్నూ కపూర్, అసలు తన ఉద్దేశం వేరేలా ఉందని చెప్పారు. "నేను ఆమె డ్యాన్స్ చూసి మెచ్చుకున్నాను. ఎంతో అందంగా, ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. ఆ సందర్భంలోనే ఆ మాట అన్నాను. అది కేవలం అభినందన మాత్రమే.. మరేదీ కాదు' అని అన్నారు. ఒకరి అందాన్ని మెచ్చుకోవడం వేరు, వారిని తప్పు కోణంలో చూడడం వేరు అని ఆయన పేర్కొన్నారు. అలాగే భాష కారణంగానే ఈ వివాదం పెరిగిందని అన్నూ కపూర్ అభిప్రాయపడ్డారు.

'నేను అదే మాటను ఇంగ్లిష్‌లో 'మిల్కీ బాడీ' అని చెప్పి ఉంటే అంత పెద్ద సమస్య అయ్యేది కాదు. కానీ హిందీలో చెప్పడంతో దానికి వేరే అర్థాలు తీసుకున్నారు' అని అన్నారు. కేవలం భాష మారితే భావం మారదని, మాటల వెనుక ఉద్దేశాన్ని కూడా చూడాలని సూచించారు. ఒక వేళ తమన్నా తన మాటలతో బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని తెలిపారు. 'తమన్నా నిజంగా బాధపడితే నేను ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమే. నా మనసులో చెడు ఉద్దేశం లేదు కాబట్టి నాకు అది చిన్న విషయం కాదు' అని అన్నారు. 71 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా తనకు మహిళలను అవమానించే ఆలోచన ఎప్పుడూ లేదని కూడా చెప్పారు.

మరోవైపు, ఈ వివాదంపై గతంలో తమన్నా కూడా స్పందించారు. శరీరాకృతిని మెచ్చుకోవడాన్ని తాను తప్పుగా చూడనని, మహిళల అందాన్ని గౌరవించే దృక్పథం అవసరమని తెలిపారు. "మిల్కీ బ్యూటీ అని పిలిస్తే నాకు ఇబ్బంది లేదు. మహిళలు తమ అందాన్ని గర్వంగా స్వీకరించాలి" అంటూ ఆమె చెప్పిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు "అన్నూ కపూర్ మాటల్లో తప్పు లేదు.. అది కేవలం ప్రశంస మాత్రమే" అంటుంటే, మరికొందరు "పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మహిళ శరీరంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు" అంటున్నారు

ఇదిలా ఉంటే.. తమన్నా విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నటనతో పాటు డ్యాన్స్ నంబర్స్‌లోనూ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమన్నా పేరు వస్తే గ్లామర్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకొస్తాయని అభిమానులు అంటున్నారు. ఏదిఏమైనా సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన కామెంట్స్ తో వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. తన మాటల వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, అవసరమైతే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X