RRR కోసం రంగంలోకి మరో బాలీవుడ్ ఖాన్.. రాజమౌళి స్పెషల్ ప్లాన్!
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం గ్యాప్ లేకుండా దేశం నలు వైపులా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇక మొన్నటివరకు సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీ గా కనిపించిన రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ నార్త్ లో కూడా సందడి చేయబోతున్నారు. అయితే ప్రమోషన్లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఇతర హీరోల సహకారం కూడా తీసుకునేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.
శనివారం రోజు జరిగిన ప్రీ రిలీజ్ వేడుక కోసం కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఆయన రాకతో కన్నడ ఇండస్ట్రీ లో కూడా ఒక్కసారిగా సినిమా స్థాయి పెరిగి పోయింది. తప్పకుండా సినిమా సౌత్ ఇండస్ట్రీలో అయితే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓ వర్గం ప్రేక్షకులు అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అంతేకాకుండా సినిమాలో అజయ్ దేవగన్ ఆలియాభట్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించడం మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు. వారితోనే సినిమాకు హిందీలో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ కోసం పిలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అయినా సరే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ఒక వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రాజమౌళి బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి మరో ఖాన్ ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఆయన మరెవరో కాదు. అమీర్ ఖాన్ అని తెలుస్తోంది. నేడు ఢిల్లీలో ప్రత్యేకంగా బాలీవుడ్ మీడియా తో మాట్లాడనున్న చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అమీర్ ఖాన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. రాజమౌళి మాత్రమే కాకుండా బాలీవుడ్లో స్టార్ హీరోలతో నిత్యం ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా టచ్ లోనే ఉంటారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో భజరంగీ భాయిజాన్ సీక్వెల్ కు కథను అందిస్తున్న విషయం తెలిసిందే. అసలైతే భజరంగీ భాయిజాన్ కథను మొదట అమీర్ ఖాన్ కు చెప్పడం జరిగింది. కానీ ఆయన సున్నితంగానే దాన్ని తిరస్కరించాడు. అయినప్పటికీ విజయేంద్రప్రసాద్ మీద ఏమాత్రం నమ్మకం అయితే తగ్గలేదు. ఆయనతో మళ్ళీ మంచి సినిమా చేయాలనే అమీర్ ఖాన్ నిత్యం ఏదో ఒక కథ గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఇక రాజమౌళి అంటే కూడా అమీర్ ఖాన్ కు చాలా ఇష్టం. అందుకే ప్రమోషన్ లో పాల్గొనేందుకు పిలవగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











