సెక్స్ వర్కర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి.. మరో వివాదంలో సంజు!

వివాదాస్పద నటుడు సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు శుక్రవారం జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అయింది. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ట్రైలర్, టీజర్ సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సంజయ్ దత్ జీవితం మొత్తం వివాదభరితం కావడంతో సంజు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. తాజగా ఈ చిత్రం విషయంలో వివాదం చెలరేగింది. సెక్స్ వర్కర్స్ మనోభావాలని కించపరిచే విధంగా ఈ చిత్రంలో డైలాగ్స్ పెట్టారని ఆరోపిస్తూ నేషనల్ విమెన్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

Another controversy on Sanju movie

సెక్స్ వర్కర్స్ తరుపున న్యాయవాది గౌరవ్ ఈ ఫిర్యాదు చేశారు. ట్రైలర్ లో సెక్స్ వర్కర్స్ కి సంబందించిన డైలాగ్ ఉంది. నీవు ఎంతమందితో పడుకున్నావు.. వేశ్యలు కాకుండా అయితే 308 అని రణబీర్ కపూర్ సమాధానం ఇస్తాడు. విమెన్ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ దీనిపై స్పందించారు. ఈ ఫిర్యాదుని ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి పంపాము. వారు ఇచ్చే నివేదికని బట్టి చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

ముంబై పేలుళ్లలో ప్రమేయం, డ్రగ్స్, అక్రమ ఆయుధ రవాణా వంటి వివాదాలతో సంజయ్ దత్ జీవితం ఒడిదుడుకులకు గురైంది. ఈ అంశాలని రాజ్ కుమార్ హిరానీ ఎలా చూపించారు అనే అంశం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X