ప్రభాస్ కోసం మరొక బాలీవుడ్ హాట్ బ్యూటీ.. గోల్డెన్ ఛాన్స్!
పాన్ ఇండియా మార్కెట్ విస్తరించిన అనంతరం నటీనటులు చాలా వరకు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఒకప్పుడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టేవారు. కానీ ఇప్పుడు సౌత్ ఆఫర్స్ పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ ఆ రూట్లో వెళ్లి మంచి విజయాలను అందుకుంటోంది.
మరికొందరు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా ఆఫర్స్ వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అందులో వాణీ కపూర్ కూడా ఉంది. ఫైనల్ గా ఆమె లక్కీ ఛాన్స్ అందుకునేందుకు దగ్గరలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ కోసం ప్రస్తుతం మరొక హీరోయిన్ కావాలని సెర్చ్ చేస్తున్నారట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరొక హీరోయిన్ పాత్ర కోసం వాణీ కపూర్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో రెబల్ స్టార్ రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.
బహుశా అందుకోసం తీసుకునే ఆలోచనలో ఉండవచ్చని సమాచారం. మరోవైపు వాణీ కపూర్ బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సలార్ తో మరొక హిట్టు పడితే కెరీర్ మరో రేంజ్ కు వెళ్లినట్లేనని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











