Pathaan: షారుక్ ఖాన్ ను సజీవ దహనం చేస్తామని.. అయోధ్య నుంచి భయంకరమైన హెచ్చరికలు!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా షారుక్ ఖాన్ కు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అతని తదుపరి సినిమా పఠాన్ నుంచి ఇటీవల ఒక సాంగ్ విడుదలైన విషయం తెలిసింది. బేషరం రంగ్ అనే ఆ పాటలో దీపిక పదుకొన్ కనిపించిన విధానంపై తీవ్ర స్థాయిలో ఓ వర్గం వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో దీపిక పదుకొన్ బికినీలో కనిపించిన విధానం కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
పఠాన్ సినిమాపై అయితే కొందరు హిందువులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన మంత్రి కూడా చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమాలు ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే తప్పకుండా అడ్డుకుంటామని కూడా అన్నారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని కొంతమంది శివాజీ అభిమానులు కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ షారుక్ ఖాన్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.

అయితే ఇప్పుడు అయోధ్యలోనే తపస్వికి చెందిన మహంతి పరమహంస కూడా ఘాటైన వ్యాఖ్యలతో చిత్ర యూనిట్ కు హెచ్చరికలు పంపించారు. ఆ పాటలో దీపిక పదుకొనే వేసుకున్న డ్రెస్ విధానం దాని రంగు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతర వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ క్షణంలో షారుఖ్ ఖాన్ ఎదురుగా కనిపిస్తే మాత్రం తగలబెడతానని ఆయన మరింత ఘాటుగా స్పందించడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సనాతన ధర్మాన్ని ఆదరించే ఎంతోమంది హిందువులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వెంటనే సినిమాలోని సన్నివేశాలను తొలగించాలి అంటూ.. ఈరోజు కేవలం ఆయన పోస్టర్లు మాత్రమే తగలబెడుతున్నాము ఒకవేళ షారుక్ ఖాన్ నాకు ఎదురుగా ఉంటే మాత్రం సజీవ దహనం కూడా చేయవలసి వస్తుంది అని మహంతి పరమహంస తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పఠాన్ సినిమాను జనవరి 25వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఈ వివాదాలపై చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











