సుశాంత్ పడుకుంటే.. పై అంతస్తులో రియా వాళ్లతో ఎంజాయ్ చేసింది.. బయటపడిన మరో సీక్రెట్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలా మరణించి ఉంటాడు అనే విషయం కన్నా ఇప్పుడు ఫోకస్ మొత్తం రియా చక్రవర్తిపై పడింది. ఆమెకు సంబంధించిన రహస్యాలు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆమె గత చరిత్రకు సంబంధించిన అనేక రకాల సీక్రెట్స్ ని బాలీవుడ్ మీడియా ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. ఇక ఇటీవల సుశాంత్ కుటుంబం తరపు లాయర్ మరో కొత్త విషయాన్ని కనుగొన్నట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

తీవ్ర స్థాయిలో ఒత్తిడి గురి చేసి..
సుశాంత్ సింగ్ ఎలాంటి స్థితిలో ఉన్నాడనే విషయాన్ని కూడా రియా పట్టించుకోలేదని కేవలం తన స్వార్థంతోనే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిందని అతనిని తీవ్ర స్థాయిలో ఒత్తిడి గురి చేసిందనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక రియా డ్రగ్స్ కూడా తీసుకుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో లాయర్ మరో కొత్త విషయాన్ని చెప్పాడు.

ఇంట్లోనే పార్టీలు..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రవర్తి ముంబైలోని ఒక డూప్లెక్స్ హౌజ్ లో కలిసి ఉండేవారు. కొన్నిసార్లు స్నేహితులతో కలిసి ఇంట్లోనే పార్టీలు కూడా చేసుకునేవారు. అయితే చాలా సందర్భాల్లో సుశాంత్ కింద రూమ్ లో పడుకుంటే.. అతన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రియా పై రూమ్ లో స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునేది. చాలా ఎంజాయ్ చేసేదని లాయర్ వివరణ ఇచ్చారు.

రియా డ్రగ్స్ వాడకం..
అలాగే సుశాంత్ కి రియా ద్వారానే డ్రగ్స్ అలవాటయ్యి ఉండవచ్చని ఆ మత్తులో అతను మరణించి ఉండవచ్చు. లేదా ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని లాయర్ తెలియజేశారు. ఇటీవల రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్ కి సంబంధాలు ఉన్నాయని వాట్సాప్ చాట్ లీక్ అయిన విషయం తెలిలిందే. ఆ వార్తలు వైరల్ అయిన కొన్ని గంటలకే సుశాంత్ తండ్రి తరపు లాయర్ ఈ విధంగా స్పందించడం విషయం మరింత సీరియస్ గా మారింది.
Recommended Video

చివరిరోజు ఇద్దరి మధ్య గొడవ
సుశాంత్ మరణించిన తేదీ జూన్ 14. ఇక రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ ని చివరగా కలిసిన డేట్ జూన్ 8. రియా చివరి రోజు సుశాంత్ తో చాలా గొడవ పడిందని ఇటీవల సుశాంత్ సన్నిహితుడు సిద్దార్థ్ పితాని బయటపెట్టాడు. అదే రోజు 8 హార్ఫ్ డిస్క్ లు కూడా ధ్వంసం అయినట్లు చెప్పాడు. ఇక సీబీఐ అధికారులు ఎప్పుడైనా రియాను అదుపులోకి తీసుకొనిఈ విషయంపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











