సుశాంత్ కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లే.. కానీ రియా డేంజర్‌ జోన్‌లోనే..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసిన సుశాంత్ కేసు విషయంలో రోజురోజుకి అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. నెపోటిజమ్ నుంచి డ్రగ్స్ వరకు అనేక రకాల యు టర్న్స్ తీసుకున్న ఈ కేసు వల్ల రియా దాదాపు డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. సుశాంత్ కేసు కంటే కూడా ఆమెపై ఇప్పుడు డ్రగ్స్ ఆరోపణలు ఎక్కువగా చుట్టు ముట్టాయి. ఇక సుశాంత్ మృతి విషయం మళ్ళీ మొదటికి వచ్చేలా ఉందని అనిపిస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
ఇంతవరకు సరైన కారణం దొరకలేదు.

ఇంతవరకు సరైన కారణం దొరకలేదు.

సుశాంత్ మరణించి 2 నెలలు దాటింది. మరో వారం గడిస్తే మూడు నెలలవుతుంది. కానీ ఇంతవరకు సరైన కారణం దొరకలేదు. ముంబై పోలీసులు మొదట్లోనే ఆత్మహత్య అని క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అంధించారు. అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు ఎక్కువవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కానీ ఇప్పటివరకు వారికి కూడా సరైన సమాధానం దొరకలేదు.

కథ మళ్ళీ మొదటికే వచ్చింది

కథ మళ్ళీ మొదటికే వచ్చింది

సుశాంత్ మృతిపై అనుమానాలు ఎక్కువైన కొద్దీ అతనిది ఆత్మహత్య కాదని పక్కా మర్డర్ అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆరోపించారు. ఏదైనా అనుమానం నిజం అవుతుందని ఇన్ని రోజులు అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. సీబీఐ కూడా చివరకు ఆత్మహత్య అని కేసుపై వివరణ ఇవ్వనుందా అనే కామెంట్స్ వస్తున్నాయి.

డ్రగ్ డీలర్స్ తో పరిచయాలు

డ్రగ్ డీలర్స్ తో పరిచయాలు

అసలు మ్యాటర్ లోకి వస్తే రియా చక్రవర్తి సుశాంత్ కేసు విషయంలో కాకుండా డ్రగ్స్ విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొనే ఆవకాశం ఉంది. ఆమె సోదరుడు డ్రగ్ డీలర్స్ తో పరిచయాలు పెంచుకొని రియాను కూడా ఇబ్బందుల్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సుశాంత్ మృతి విషయంలో ఆమె పాత్ర ఎంతవరకు ఉందనే విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు.

ఆ విషయంలో సాక్షాలు లేక..

ఆ విషయంలో సాక్షాలు లేక..


సుశాంత్ డబ్బులు కాజేసిందా లేక సుశాంత్ మరణించడానికి ఆమె మానసికంగా ఇబ్బంది పెట్టిందా అనే విషయంలో కూడా సీబీఐకి సరైనా సాక్ష్యాలు దొరకలేదు. దీంతో ఆ కేసు కంటే కూడా రియా ఇతర విషయాలతోనే ఎక్కువగా సతమతమవుతోంది. మరోవైపు ఆమెకు కొంతమంది స్టార్స్ నుంచి భారి స్థాయిలో మద్దతు లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X