#మీటూ ఎఫెక్ట్: మ్యూజిక్ డైరెక్టర్ మీద వేటు పడింది, ఆ నలుగురి వల్లే...
లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్ మీద వేటు పడింది. సోనీ ఎంటర్టెన్మెంట్ టెలివిజన్లో ప్రసారం అవుతున్న సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ 10 నుంచి అతడిని తప్పించినట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఇండియన్ ఐడల్ 10 షోకు విశాల్ దద్లాని, నేహా కక్కర్‌తో కలిసి అను మాలిక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఇండియన్ ఐడల్ 10 షో జడ్జ్ ప్యానెల్‌లో అను మాలిక్ కొనసాగరంటూ నిర్వాహకుల నుంచి ఒక ప్రకటన వెలువడింది. అతడి స్థానంలో ఎవరు వస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు.

అను మాలిక్ స్టేట్మెంట్
మరో వైపు అను మాలిక్ కూడా తాను ఇండియన్ ఐడల్ షో నుంచి బ్రేక్ తీసుకుంటుననట్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల తాను ఈ షోలో కొనసాగలేక పోతున్నట్లు వెల్లడించారు.

ఆ నలుగురి వల్లే...
ప్రముఖ బాలీవుడ్ సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిత్ అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీరి తర్వాత మరో ఇద్దరూ సింగర్స్ కూడా అతడి కామోన్మాద చర్యలను బయట పెట్టారు.

అను మాలిక్ దారుణాలు
అనుమా మాలిక ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని, ప్యాంట్ విప్పేసి తన స్కర్ట్ పైకి లేపాడని... సమయానికి కాలింగ్ బెల్ మ్రోగడంతో తాను తప్పించుకున్నానని, తర్వాత ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని తీసుకెళుతూ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి జిప్ విప్పేసి తనను లిక్ చేయమన్నాడని.. అప్పుడు కూడా అదృష్ట వశాత్త తప్పుకున్నట్లు పేరు బయటకు చెప్పని ఓ సింగర్ ఆరోపించారు.

ఇండియన్ ఐడల్ 10కు దూరం
మరో సింగర్ కూడా అను మాలిక్ ఓ స్టూడియోకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించడం వల్ల.... ఇండియన్ ఐడల్ 10లో పాల్గొనే అవకాశం వచ్చినా దానికి అను మాలిక్ జడ్జిగా ఉండటం వల్ల తిరస్కరించినట్లు ఆరోపించారు.


Click it and Unblock the Notifications











