twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ స్టూడియోలో అడుగు పెట్టకుండా నిషేధం!

    |

    బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్ పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్లు #మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అనుమాలిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిని స్టూడియో ఆవరణలోకి కూడా అడుగు పెట్టకుండా బ్యాన్ విధించింది.

    మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని లోనికి అనుమతించకూడని యష్ రాజ్ స్టూడియో యాజమాన్యం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. గతేడాది సెక్సువల్ మిస్ కండక్ట్ ఆరోపణలు ఎదుర్కొన్న స్టూడియో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఆశీష్ పటేల్‌ను సైతం తొలగించింది.

     Anu Malik has been banned from Yash Raj studio

    #మీటూ ఆరోపణల కారణంగా ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న అను మాలిక్ ఈ ప్రఖ్యాత రియాల్టీ షో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. సింగర్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిత్, అలిషా... అతడి లైంగికంగా వేధింపులను బట్టబయలు చేశారు. మరో ఇద్దరు మహిళలు సైతం అనుమాలిక్ భాగోతాన్ని మీడియాకు తెలిపారు.

    #మీటూ ఆరోపణల కారణంగా బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్‌పై సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నిషేదం కొనసాగుతోంది. వీరిని కూడా యష్ రాజ్ ఫిలింస్ స్టూడియోలోకి అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

    English summary
    Bollywood media reports said that, Anu Malik who has been accused of sexual misconduct by several women, has been bannned from entering the premises of Yash Raj studio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X