సుశాంత్ ఎఫెక్ట్: బాలీవుడ్‌కు స్టార్ డైరెక్టర్ గుడ్‌బై.. సెన్సేషనల్ ట్వీట్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నెపొటిజం, గ్రూపిజం, సూసైడ్ గ్యాంగ్ లాంటి మాటలతో హిందీ పరిశ్రమ వాతావరణం కలుషితమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి తప్పుకుంటున్నానంటూ దర్శకుడు అనుభవ్ సిన్హా ట్వీట్ చేయడంతో ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆయన గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణం ఏమిటంటే..

సామాజిక చిత్రాల దర్శకుడు

సామాజిక చిత్రాల దర్శకుడు

బాలీవుడ్‌లో అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆయన నిర్మించిన చిత్రాల ముల్క్, ఆర్టికల్ 15ఏ, తాజాగా తప్పడ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నాయి. సామాజిక సమస్యలపై సినీ విమర్శనాస్త్రాలు సంధించడంలో అనుభవ్ సిన్హాది ప్రత్యేకమైన శైలి అని సినీ వర్గాల అభిప్రాయం.

 బాలీవుడ్‌ను షాక్ చేసిన ట్వీట్

బాలీవుడ్‌ను షాక్ చేసిన ట్వీట్

సామాజిక స్పృహ ఉన్న దర్శకుడు అనుభవ్ సిన్హా అనూహ్యంగా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడం దేశవ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రముఖులను నివ్వెరపాటుకు గురిచేసింది. అనుభవ్ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణమేమై ఉంటుందా అనే అనుమానాలు, చర్చలు భారీగా మొదలయ్యాయి.

బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నా

బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నా

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నానంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేస్తూ.. ఇక జరిగింది చాలూ.. బాలీవుడ్‌కు నేను గుడ్‌బై చెబుతున్నాను. అందుకే రాజీనామా సమర్పిస్తున్నాను. పరిశ్రమలో జరిగిన చెత్తంతా భరించలేకుండా ఉంది. బాలీవుడ్ ఒకప్పుడు ఉండేది. ఇక ముందు కూడా హిందీ చిత్ర పరిశ్రమతో కొనసాగుతుంటుంది అంటూ నర్మగర్భమైన ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ తర్వాత బాలీవుడ్ అనే స్టాటస్‌ను తన ట్విట్టర్ నుంచి తొలగించారు.

Recommended Video

#YoSonakshiSoDumb | Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana
అనుభవ్ సిన్హా నిర్ణయంపై దర్శకుల కామెంట్

అనుభవ్ సిన్హా నిర్ణయంపై దర్శకుల కామెంట్

బాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతూ అనుభవ్ సిన్హా చేసిన ట్వీట్‌పై పలువురు దర్శకులు స్పందించారు. దర్శకుడు సుధీర్ మిశ్రా స్పందిస్తూ.. బాలీవుడ్‌ను వదిలేద్దాం. ఇండియన్ సినిమా వైపుకు పయనిద్దాం. భారతీయ కథలను ప్రేక్షకులకు చెబుదాం అంటూ ట్వీట్ చేశారు. అనుభవ్ సిన్హా నిర్ణయంపై సుధీర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X